Source: behappy.org.in
ఒక విద్యార్ధి తరగతి గదిలో శ్రద్ధగా పాఠం వినగలిగితే ఆ విద్యార్ధికి ఏకాగ్రత బాగా ఉన్నట్లే. అలాగే ఏదైనా ఒకపని చేస్తున్నప్పుడు, మనసు ఆ పనిమీదే లగ్నం అయితే వారికి ఏకాగ్రత బాగున్నట్లే. కాని విచారకరమైన విషయ మేమిటంటే పాఠశాల విద్యార్ధుల్లో కూడా సగం మంది ఏకాగ్రత కుదరక బాధ పడుతున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అన్నా - చెల్లెలు లాంటివి. ఈ రెండు తగ్గిపోవడానికి దాదాపుగా ఒకేరకమైన కారణాలుంటాయి. ఆ కారణాలు దిగువ ఇవ్వబడ్డాయి.
విద్యార్ధుల్లో ఏకాగ్రత తగ్గడానికి కారణాలు
1. ఎక్కువ సమయం చదవడం
2. ఏకధాటిగా చదవడం
3. సబ్జెక్టు అర్థం కాకపోవడం
4. సబ్జెక్టు ఇష్టం లేకపోవడం
5. టీచర్ అంటే ఇష్టం లేకపోవడం
6. కుటుంబ సమస్యలు
7. తల్లిదండ్రుల వత్తిడి
పెద్దవారిలో ఏకాగ్రత తగ్గడానికి కారణాలు
1. ఆరోగ్యసమస్యలు
2. ఆర్ధిక ఇబ్బందులు
3. కుటుంబ కలహాలు
4. మానసిక వత్తిడి
5. భయాలు
6. తాగుడు
7. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన
8. విటమినుల లోపం
9. యాంటి బయాటిక్స్ వాడటం
10. పనిలేకుండా ఖాళీగా ఉండటం
11. తలకు దెబ్బ తగలడం
12. వయస్సు పై బడటం
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
- ఏకగ్రత తగ్గడానికి గల కారణాన్ని విశ్లేషించాలి.
- సరియైన జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి.
- మంచి భవిష్యత్‌కై ఆలోచించాలి.
- జీవితం విలువ అర్థం చేసుకోవాలి.
- ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి.
- ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి.
- ప్రశాంతంగా ఉండే పరిసరాలలో చదువుకోవాలి.
- అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
*ఏకాగ్రత వుంటేనే విజయం వరిస్తుంది*