Source: behappy.org.in
ఏ వ్యక్తి అయినా జీవితంలో విజయం సాధించాలంటే తోటివారి పట్ల మర్యాదగా, మన్ననతో ప్రవర్తించాలి. మర్యాద, మన్ననలకు పునాది కుటుంబమే. కుటుంబంలోనే పిల్లలు పెద్దలను గౌరవించడం, ఓర్చుకోవడం, పంచుకోవడం వంటి విలువను నేర్చుకొంటారు. కుటుంబంలోనే కాక సమాజంలో కూడా సాంఘిక మర్యాద, మన్నలు పాటించాలి. అప్పుడే తోటి వారినుండి గౌరవాన్ని, మర్యాద మన్ననలను పొందగలుగుతారు.
విద్యార్ధులు నేర్చుకోవాల్సిన కొన్ని పద్ధతులు

- ఇతరుల నుండి వస్తువులను తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారి అనుమతి తీసుకోవాలి.
- పని పూర్తి కాగేనే వాటిని తిరిగి ఇచ్చివేయడం
- వ్యక్తిగత విషయాలలో అంగీకారంలేకుండా తలదూర్చకుండా ఉండటం
- ఇతరులను గురించి చాటున చెడుగా మాట్లాడకుండా ఉండటం
- ఇతరులను మాటలతోగాని, చేతలతోగాని బాధించకుండా ఉండటం
- ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించాలి. పొరపాటు ఉంటే మృదువుగా చెప్పడం.
మర్యాద మన్ననలు పాటించడం కేవలం మనకోసమే. మనం ఎంత వరకు పాటిస్తే ఎదుటివారి నుండి మనకు అంతవరకే దక్కుతాయి.
*ఎదుటి వారిని గౌరవించినప్పుడే , వారి నుండి గౌరవం పొందగలుగుతారు*