Tuesday, May 21, 2019

మోసం, అన్యాయాలు జీవితాలను బాగుచేస్తాయా?

మోసం, అన్యాయం ద్వారా వచ్చే డబ్బు, ఆస్తి వారి  జీవితాలను బాగుచేస్తుందని ఆశపడుతున్నారు. ఇప్పటి దాకా అలా చేసినవా రికి  ఏమి మిగిలిందో, ఏమయ్యారో మన చుట్టూ ఉన్నవాళ్ళని చూస్తే తెలుస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇలాంటి వాటికీ దూరంగా పెంచగలిగితే వాళ్ళు నిజమైన సంతోషంతో జీవిస్తారు.








మొక్కలు నాటడం వల్ల ఉపయోగాలు


Friday, May 17, 2019

ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో?

పాఠశాల స్థాయిలోనే మంచి చెడు నేర్పకపోతే ఇలాంటివే ముందు ముందు ఎన్నో ఘోరాలు వినడం/చూడాల్సి రావటం జరుగుతుంది.




Saturday, May 11, 2019

ఈ పాపం ఎవరిదో అందరికీ తెలుసు




వీరికి అందరి అండ కావాలి

కోర్టులు, పోలీసులు, సామాజిక సేవా సంస్థలు, సభ్య సమాజం , అధికారులు అందరూ ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి చదువు ఆగి పోకుండా, ఆర్థిక సహాయంతో పాటు న్యాయ సహాయం కూడాఅందించాలి. ఇలాంటి కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చెయ్యాలి.

Wednesday, May 8, 2019

కోడలిగా అయితే అన్యాయమంట, అత్తగా అయితే న్యాయమేనంట!




















ఇలాంటి చావులు, వేధింపులు వినీ విని మామూలు అయిపోయ్యాయి. అయితే వీటికి  కారణమైన వారి గురించి మాత్రం కొన్ని సందేహాలు మిగిలిపొయ్యాయి.
భర్త
తల్లిని అభిమానిస్తాడు, గౌరవిస్తాడు.చేల్లెల్ని, అక్కని ప్రేమగా చూసుకుంటాడు. కూతురి కోసం ప్రాణం ఇస్తాడు. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధ పడతాడు, వాళ్లను చంపుతాను అంటాడు. కానీ తనకోసం బ్రతికే భార్యను మాత్రం చాలా మంది వేధిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, శత్రువులా చూస్తున్నారు, చంపుతున్నారు కూడా. ఒక్క భార్యనే ఎందుకని? దుర్మార్గులైన తల్లిదండ్రుల నుండి భార్యను కాపాడలేని మగాడు మగాడు అవుతాడా? అలాంటివాడు నంబర్ వన్ __ అవుతాడు.

ఇలాంటి వాళ్ళను రెండవ వివాహానికి అనర్హులుగా కోర్టులు తీర్పు ఇవ్వాలి. 
అత్త
తన కూతుర్ని అత్తింటివారు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, లేకపోతే శాపనార్థాలు పెడుతుంది, అన్యాయమని ఏడుస్తుంది. అదే తన కోడలిని తిట్టినా కొట్టినా మాట్లాడకుండా పడి వుండాలి. తానూ ఒక ఆడదాన్నే అన్న విషయం   మర్చిపోయి, సాటి ఆడదాన్ని బెదిరించదానికి, వేధించడానికి సిగ్గు పడాలి. కోడలు నీ కుతురిలాంటిది కాదా? తాను  కోడలిగా ఉన్నప్పుడు అత్త నుండి ఎలాంటి ఆప్యాయత కోరుకుందో మర్చిపోయి రాక్షసిలా ప్రవర్తించడం తనకు పట్టిన దౌర్భాగ్యం అని అర్థం చేసుకోవాలి. తన మానసిక పరిస్థితికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇలాంటి అత్తలు ఆడవాళ్ళు అవుతారా? నంబర్ టు -- అవుతారు. 
మామ
ఇంట్లో జరుగుతున్న అరాచకాన్ని చూస్తూ ఊరుకోవడం, లేదా భార్య, కొడుకులతో చేయి కలిపి వేధించే మామలు మూడో నంబర్ --- అవుతారు. 
తల్లిదండ్రులు
తన బాధ చెప్పుకుని, అత్తవారింటికి వెళ్లనని చెప్పినా, రక్షణ కల్పించాల్సింది పోయి  అదే నరకానికి పంపించేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచి, కంటతడి పెడితేనే  తట్టుకోలేని వారు, అలాంటి నరకంలోకి ఎలా పంపిస్తున్నారు? ఏదో ఒక పని చేసుకుని బ్రతక లేదా? ఆలోచించండి. 

తప్పించుకోలేరు, ఆ ప్రకృతి శక్తి నుండి తప్పుచేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరు, తప్పు నిప్పులాంటిది, ఏదో ఒక రోజు కాల్చి వేస్తుంది, ఇది నిజం.



Tuesday, May 7, 2019

వీళ్ళను డాక్టర్లు అన్నది ఎవరు? వీళ్ళదీ ఒక బ్రతుకేనా?


ఇప్పటికే చాలాసార్లు మొలకెత్తింది

రైతు సంవత్సరమంతా కష్టపడి పంట పండిస్తాడు. తానూ వేసింది మంచి విత్తనాలు కాదని తెలియక డబ్బు ఖర్చు చేయడంతోపాటు శ్రమ పడతాడు. డబ్బు కోసం బ్క్యాంక్  నుండి లోన్ తీసుకోవడమో, వడ్డీకి   తీసుకురావడమో చేస్తాడు.  ఈ మోసగాళ్ళ వలన  అప్పు తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటాడు.  ఇలా జరిగినవన్నీ హత్యలే కాబట్టి ఇందుకు  కారణమైన వారికి ఉరి శిక్ష వేయడం సబబు.  

Sunday, May 5, 2019

ఇప్పటికే చాలా మంది భవిష్యత్తును చిదిమేసారు

అశాస్త్రీయంగా చదివిస్తే మార్కులు వస్తాయా? విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకోగలుగుతారా?

వేలు, లక్షలు ఫీజు కింద వసూలు చేసి పనికిరాని విద్యార్థులను సమాజానికి అందించడానికి వీళ్లకు అధికారం ఎవరిచ్చారు? ఈ నేరం క్షమార్హం కాదు. వీళ్లకు కొమ్ము కాసేవారూ క్షమార్హులుకారు.


కొన్ని కళాశాలల్లో మేనేజ్మెంట్ వైఖరి ఎలా ఉందంటే;

ఎవరు ఏదైనా రాయనీయండి               అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
నిజమే రాశారు అనుకోండి                  అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
పిల్లల్లో సృజనాత్మకత పోతుంది            అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
మానసిక ఒత్తిడి పెరుగుతుంది             అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది              అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
ఆత్మహత్యలు చేసుకుంటారు               అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం

స్వార్థం అవధులు దాటి ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు.