Wednesday, May 8, 2019

కోడలిగా అయితే అన్యాయమంట, అత్తగా అయితే న్యాయమేనంట!




















ఇలాంటి చావులు, వేధింపులు వినీ విని మామూలు అయిపోయ్యాయి. అయితే వీటికి  కారణమైన వారి గురించి మాత్రం కొన్ని సందేహాలు మిగిలిపొయ్యాయి.
భర్త
తల్లిని అభిమానిస్తాడు, గౌరవిస్తాడు.చేల్లెల్ని, అక్కని ప్రేమగా చూసుకుంటాడు. కూతురి కోసం ప్రాణం ఇస్తాడు. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధ పడతాడు, వాళ్లను చంపుతాను అంటాడు. కానీ తనకోసం బ్రతికే భార్యను మాత్రం చాలా మంది వేధిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, శత్రువులా చూస్తున్నారు, చంపుతున్నారు కూడా. ఒక్క భార్యనే ఎందుకని? దుర్మార్గులైన తల్లిదండ్రుల నుండి భార్యను కాపాడలేని మగాడు మగాడు అవుతాడా? అలాంటివాడు నంబర్ వన్ __ అవుతాడు.

ఇలాంటి వాళ్ళను రెండవ వివాహానికి అనర్హులుగా కోర్టులు తీర్పు ఇవ్వాలి. 
అత్త
తన కూతుర్ని అత్తింటివారు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, లేకపోతే శాపనార్థాలు పెడుతుంది, అన్యాయమని ఏడుస్తుంది. అదే తన కోడలిని తిట్టినా కొట్టినా మాట్లాడకుండా పడి వుండాలి. తానూ ఒక ఆడదాన్నే అన్న విషయం   మర్చిపోయి, సాటి ఆడదాన్ని బెదిరించదానికి, వేధించడానికి సిగ్గు పడాలి. కోడలు నీ కుతురిలాంటిది కాదా? తాను  కోడలిగా ఉన్నప్పుడు అత్త నుండి ఎలాంటి ఆప్యాయత కోరుకుందో మర్చిపోయి రాక్షసిలా ప్రవర్తించడం తనకు పట్టిన దౌర్భాగ్యం అని అర్థం చేసుకోవాలి. తన మానసిక పరిస్థితికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇలాంటి అత్తలు ఆడవాళ్ళు అవుతారా? నంబర్ టు -- అవుతారు. 
మామ
ఇంట్లో జరుగుతున్న అరాచకాన్ని చూస్తూ ఊరుకోవడం, లేదా భార్య, కొడుకులతో చేయి కలిపి వేధించే మామలు మూడో నంబర్ --- అవుతారు. 
తల్లిదండ్రులు
తన బాధ చెప్పుకుని, అత్తవారింటికి వెళ్లనని చెప్పినా, రక్షణ కల్పించాల్సింది పోయి  అదే నరకానికి పంపించేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచి, కంటతడి పెడితేనే  తట్టుకోలేని వారు, అలాంటి నరకంలోకి ఎలా పంపిస్తున్నారు? ఏదో ఒక పని చేసుకుని బ్రతక లేదా? ఆలోచించండి. 

తప్పించుకోలేరు, ఆ ప్రకృతి శక్తి నుండి తప్పుచేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరు, తప్పు నిప్పులాంటిది, ఏదో ఒక రోజు కాల్చి వేస్తుంది, ఇది నిజం.



No comments: