రైతు సంవత్సరమంతా కష్టపడి పంట పండిస్తాడు. తానూ వేసింది మంచి విత్తనాలు కాదని తెలియక డబ్బు ఖర్చు చేయడంతోపాటు శ్రమ పడతాడు. డబ్బు కోసం బ్క్యాంక్ నుండి లోన్ తీసుకోవడమో, వడ్డీకి తీసుకురావడమో చేస్తాడు. ఈ మోసగాళ్ళ వలన అప్పు తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటాడు. ఇలా జరిగినవన్నీ హత్యలే కాబట్టి ఇందుకు కారణమైన వారికి ఉరి శిక్ష వేయడం సబబు.
