Sunday, March 31, 2019

మానసిక ఒత్తిడి

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
Designed by Yanalya - Freepik.com

మారుతున్న సమాజంలో  శాస్త్రీయ, ఆర్ధిక రంగాలలో త్వరిత గతిన వస్తున్న మార్పులు మనుషుల్లో మానసిక వత్తిడిని కలుగజేస్తున్నాయి.  వ్యక్తిగత ఆలోచనలు, కుటుంబ ఉద్యోగ సామాజిక రంగాలలో చోటుచేసుకున్న పరిణామాలు మానసిక వత్తిడిని పెంచుతున్నాయి.

మానసిక వత్తిడి వ్యక్తి శారీరక, మానసిక, సాంఘిక జీవనం పై ప్రభావము చూపిస్తుంది. అంతేగాక వ్యక్తి సంజ్నాత్మక చర్యలపై అంటే అభ్యసనము, స్మృతి, చింతనము మొదలగు వాని వికాసము, దక్షతను కుంటుపరుస్తుంది.

మానసిక వత్తిడికి కారణాలు
  • శక్తికి మించిన లక్ష్యాలు
  • ఆరోగ్యం
          భౌతిక ఆరోగ్యం
          మానసిక ఆరోగ్యం
  • కుటుంబ సమస్యలు
           తగాదాలు
           అర్ధిక పరమైనవి
           సర్దుకు పోలేక
  • స్నేహితులు
  • ప్రేమ వ్యవహారాలు
  • చదువులో వెనకబడడం
  • చెడు అలవాట్లు
  • వృత్తి / ఉద్యోగంలో వత్తిళ్లు
  • టీజింగ్‌ / ర్యాగింగ్‌


వత్తిడిని తగ్గించుకునే మార్గాలు
  • శ్వాస ప్రక్రియకు సంబంధించిన వ్యాయామాలు
  • రిలాక్సెషన్‌ ప్రక్రియలు. అన్ని లలితకళలు ఆటలు, పాటలు, డాన్స్‌, పెయింటింగ్‌, సంగీతము, యోగా ఆసనములు.
  • ముందుగా ప్రణాళిక వేసుకోవడం
  • పని ఆరభించడానికి ముందే దానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడం
  • పనిని వాయిదా వేయకుండా ఉండటం
  • పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా చేసి పూర్తి చేయడం.


నష్టాలు

భౌతిక సమస్యలు
తలనొప్పి
వెన్ను నొప్పి
స్పాండిలైటిస్‌
ఆస్థ్మా 
పుండ్లు       
 డయేరియా
వాంతులు
అకలి తక్కువ
 సెక్స్‌ సమస్యలు
గజ్జి  
నిద్ర లేమి
గుండె సమస్యలు
షుగర్‌
ఊబకాయం
అజీర్తి

మానసిక సమస్యలు
అసహనం        
కోపం
అస్థిరత్వం
ఙాపక శక్తి తగ్గడం
అశాంతి
డిప్రెషన్‌
భయం         
ఆందోళన 



*మానసిక వత్తిడిని జయిస్తే ఆరోగ్యం మీ ముంగిట్లోనే*

ఏకాగత్ర మరియు జ్ఞాపకశక్తి

Source: behappy.org.in
                       

                                                                             Designed by- Freepik.com
ఒక విద్యార్ధి తరగతి గదిలో శ్రద్ధగా పాఠం వినగలిగితే ఆ విద్యార్ధికి ఏకాగ్రత బాగా ఉన్నట్లే. అలాగే  ఏదైనా ఒకపని చేస్తున్నప్పుడు, మనసు ఆ పనిమీదే లగ్నం అయితే వారికి ఏకాగ్రత బాగున్నట్లే. కాని విచారకరమైన విషయ మేమిటంటే పాఠశాల విద్యార్ధుల్లో కూడా సగం మంది ఏకాగ్రత కుదరక బాధ పడుతున్నారు.  ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అన్నా - చెల్లెలు లాంటివి. ఈ రెండు తగ్గిపోవడానికి దాదాపుగా ఒకేరకమైన కారణాలుంటాయి. ఆ కారణాలు దిగువ ఇవ్వబడ్డాయి.

విద్యార్ధుల్లో ఏకాగ్రత తగ్గడానికి కారణాలు 

1. ఎక్కువ సమయం చదవడం
2. ఏకధాటిగా చదవడం
3. సబ్జెక్టు అర్థం కాకపోవడం
4. సబ్జెక్టు ఇష్టం లేకపోవడం
5. టీచర్‌ అంటే ఇష్టం లేకపోవడం
6. కుటుంబ సమస్యలు
        7. తల్లిదండ్రుల వత్తిడి

పెద్దవారిలో ఏకాగ్రత తగ్గడానికి కారణాలు 

1. ఆరోగ్యసమస్యలు      
2. ఆర్ధిక ఇబ్బందులు
3. కుటుంబ కలహాలు      
4. మానసిక వత్తిడి
5. భయాలు     
6. తాగుడు
7. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన   
8. విటమినుల లోపం
9. యాంటి బయాటిక్స్‌ వాడటం      
10. పనిలేకుండా ఖాళీగా ఉండటం
11. తలకు దెబ్బ తగలడం    
12. వయస్సు పై బడటం


       ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?

  • ఏకగ్రత తగ్గడానికి గల కారణాన్ని విశ్లేషించాలి.
  • సరియైన జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి.
  • మంచి భవిష్యత్‌కై ఆలోచించాలి.
  • జీవితం విలువ అర్థం చేసుకోవాలి.
  • ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి.
  • ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. 
  • ప్రశాంతంగా ఉండే పరిసరాలలో చదువుకోవాలి.
  • అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి.



*ఏకాగ్రత వుంటేనే విజయం వరిస్తుంది*



క్రమశిక్షణ

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
Designed by- Freepik.com


మనిషి తన లక్ష్యం సాధించడానికి క్రమశిక్షణ ఎంతో అవసరం. చదువు సంధ్యలేని పశుపక్ష్యాదులు క్రమబద్ధమైన జీవితం గడుపుతున్నాయి. చదువు, తెలివితేటలు ఉండికూడా కొందరు మనుషులు క్రమశిక్షణతో జీవించలేక పోతున్నారు. 

క్రమశిక్షణతో జీవించడం అంటే కొందరు శిక్షలాగా భావిస్తున్నారు. అదికేవలం మన జీవితం బాగుండానికే అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణతో మెలిగితే ఎన్నోలాభాలు ఉన్నాయి. ఉదాహరణకు నిబంధనలు లేకుండా ఆటలపోటి నిర్వహించామనుకోండి. అది రసాభాసవుతుంది. అలాగే మార్గదర్శక సూత్రాలు లేకుండా, ఉన్నా పాటించకపోతే సామాజిక జీవనం అశాంతితో అల్లాడుతుంది. జీవితాలకు రక్షణ కరువవుతుంది.

అయితే విద్యార్ధులకు క్రమశిక్షణ నేర్పడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరియైన పద్ధతులను అవలంభించాలి. అలాకానట్లయితే జీవితాన్ని తీర్చిదిద్దే క్రమశిక్షణ విద్యార్ధులకు శిక్షలాగే అనిపించుతుంది.  క్రింది సూచనలను పాటిస్తే విద్యార్ధులు జీవితంలో విజేతలుగా నిలుస్తారు. 


పాటించాల్సినవి

  • ఉదయాన్నే మరుగుదొడ్డికి వెళ్ళడం, పళ్ళుతోముకోవడం, స్నానంతో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం
  • నియమబధ్దంగా ఆహారం తీసుకోవాలి.
  • రుచికోసం అతిగా తినకూడదు, శరీరానికి అవసరంలేని ఆహారాన్ని తీసుకోకూడదు.
  • మంచి అలవాట్లు చేసుకోవాలి.
  • ఇంటా బయట సమాజిక నిబంధనలను పాటించాలి
  • చట్టాలకు లోబడి ప్రవర్తించాలి.
  • సత్యం, ధర్మం, న్యాయాలను కాపాడాలి.
  • మృదువుగా మాట్లాడాలి.
  • ఇతరులకు హాని తలపెట్లకూడదు.
  • ఇతరులకు చెయ్యగలిగిన సహాయం చెయ్యాలి.
  • ఏరోజు చెప్పినవి ఆరోజే చదువుకోవాలి.
  • హోంవర్కు చెయ్యాల్సిన సమయంలోనే పూర్తి చేయాలి.
  • రహదారి నియమాలను పాటించాలి.


లాభాలు 
  • ఆరోగ్యం బాగుంటుంది.
  • మంచి మార్కులతో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
  • సమాజంలో ఓ మంచి మనిషిగా పేరు పొందవచ్చు.
  • తల్లిదండ్రులు గర్వపడేలా జీవించవచ్చు.
  • చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.


*క్రమ శిక్షణలేని జీవితం ఓ తెగిన గాలిపటం *

మన దేహం విలువ ఎంత?


Designed by Smithytomy - Freepik.com

సాధారణంగా ఈ దేహం గురించి పెద్దగా ఆలోచించం. ఏదైనా అవయం పని చెయ్యకపోతే మాత్రం అప్పడు గుర్తొస్తుంది.  ఒక అవయం లేకుండా జీవిస్తున్న వాళ్లకు  దాని విలువ బాగా తెలుసు. మనం కూడా ఒక్క వారం రోజులు ఒంటి కాలుతో జీవించి చూస్తే ,  కాలు  విలువ బాగా తెలుస్తుంది.

అన్ని అవయవాలు  సక్రమంగా పనిచేస్తె మన లక్ష్యాన్ని తేలిగ్గా సాధించగలం. కాబట్టి మనం వాటి విలువ తెలిసి జాగ్రత్త తీసుకోవాలి. వాటి విలువ ఎంతో తెలియాలంటే క్రింది పట్టికను పూర్తి చెయ్యండి.

దేహ భాగం (విలువ, లక్షల రూపాయల్లో)

మెదడు

గుండె

ఊపిరితిత్తులు

నాడీమండలం

మూత్రపిండాలు

లివరు

కళ్ళు

నాలుక

చేతులు

కాళ్ళు

మిగిలినవి

ఈ పట్టికనుబట్టి శరీరానికి  విలువ కట్టలేమని, మన దేహం విలువ అనంతమని  తెలుస్తోంది. మనిషి ఇంతవరకు రూపొందించలేని ఓ అద్భుత వ్యవస్థ - ఈ దేహం. విలువ కట్టలేని ఈ దేహాన్ని ఎలాంటి పనులకు ఉపయోగిస్తున్నామో  ప్రతి వక్కరం గమనించాలి.

*ఈ  దేహం విలువ ఎంత?*

మన సమయం విలువ ఎంతో తెలుసుకుందాం



clipartsgram.com

ఒక మనిషి ఎంత కాలం బ్రతుకుతాడో ఎవరూ చెప్పలేరు. తల్లి గర్భం నుండి బయటపడక ముందునుండి సుమారుగా 125 సంవత్సరాలలోపు ఎప్పడైనా చనిపోవచ్చు. ఇది ఒక్క గంట కూడా గ్యాంంటిలేని జీవితం. ఈ విషయాన్ని మరచి చాలమందిసమాయాన్ని వృధాచేసుకుంటున్నారు.

సమయం విలువ తెలుసుకోవాలంటే క్రింది పట్టికను పూర్తి చెయ్యండి.

ఒక మనిషి 100 సం||లు జీవించాడనుకోండి. అప్పుడు మనకు  100 *365 = 36,500 రోజుల జీవిత కాలం ఉంటుంది.

  ఈ కాలాన్ని మనం ఉపయోగించుకొనే విధానం (సుమారుగా)

*1) మొదటి 20 సం||లు,
    చివరి 30 సం||లు                                       50*365     = 18,250 రోజులు
    మొత్తం 50 సం||లు తీసివేయండి

2) మిగిలిన 50 సం||లలో

    నిద్రపోవడానికి రోజుకు

     సరాసరి 8 గం||ల చొప్పున

     (రోజులో మూడోవంతు) 50*1/3*365 = 6,083 రోజులు

3) కాలకృత్యాలు స్నానం, తయారవడం

    తినడం, రోజుకు 3 గం|| చొప్పున

    (రోజులో ఎనిమిదోవంతు)                               50*1/8*365 = 2,281 రోజులు

4) టి.వి, సినిమాలు, షికార్లు

కబుర్లు, ఫోన్‌, వాదనలు, తగాదాలు

రోజుకు 3 గంల చొప్పున    50*1/8*365 = 2,281 రోజులు

(ఎనిమిదోవంతు)

5) ఫంక్షన్లు, రోగాలు, ప్రమాదాలు

     మొ||వి సంవత్సరానికి 20 రోజుల 

చొప్పున 50 సం||లకు 50*20 = 1,000 రోజులు

మొత్తం = 29,895 రోజులు

** చివరికి మిగిలింది                                           (36,500 - 29,895) = 6,605 రోజులు

   * 1 నుండి 20 సం||ల వయసు వరకు నేర్చుకొంటూవుంటాము. 71 నుండి 100 వరకు                           మనపని మనం చేసుకోగలిగితే చాలు.

   ** ఈ సమయాన్ని కూడా ఉద్యోగంలోనో, మరేదో ఒక పనికోసం ఉపయోగిస్తాం. మనల్ని                      తీర్చిదిద్దు కోవడం కూడా ఈ సమయంలోనే చేసుకోవాలి. అంటే మనకున్న సమయం                  ఎంత! కేవలం 6,605 రోజులు.

ఒక్కరోజు విలువ ఎంత ?

ఒక్క గంట విలువ ఎంత?

*ఆలోచించండి*
Source: behappy.org.in

మర్యాద, మన్నన

Source: behappy.org.in

ఏ వ్యక్తి అయినా జీవితంలో విజయం సాధించాలంటే తోటివారి పట్ల మర్యాదగా, మన్ననతో ప్రవర్తించాలి.  మర్యాద, మన్ననలకు పునాది కుటుంబమే. కుటుంబంలోనే పిల్లలు పెద్దలను గౌరవించడం, ఓర్చుకోవడం, పంచుకోవడం వంటి విలువను నేర్చుకొంటారు.  కుటుంబంలోనే కాక సమాజంలో కూడా సాంఘిక మర్యాద, మన్నలు పాటించాలి. అప్పుడే తోటి వారినుండి గౌరవాన్ని, మర్యాద మన్ననలను పొందగలుగుతారు.


విద్యార్ధులు నేర్చుకోవాల్సిన కొన్ని పద్ధతులు
  • ఇతరుల నుండి వస్తువులను తీసుకోవాల్సి వచ్చినప్పుడు వారి అనుమతి తీసుకోవాలి.
  • పని పూర్తి కాగేనే వాటిని తిరిగి ఇచ్చివేయడం
  • వ్యక్తిగత విషయాలలో అంగీకారంలేకుండా తలదూర్చకుండా ఉండటం
  • ఇతరులను గురించి చాటున చెడుగా మాట్లాడకుండా ఉండటం
  • ఇతరులను మాటలతోగాని, చేతలతోగాని బాధించకుండా ఉండటం
  • ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించాలి. పొరపాటు ఉంటే మృదువుగా చెప్పడం.


మర్యాద మన్ననలు పాటించడం కేవలం మనకోసమే. మనం ఎంత వరకు పాటిస్తే  ఎదుటివారి నుండి మనకు అంతవరకే దక్కుతాయి.




*ఎదుటి వారిని గౌరవించినప్పుడే , వారి నుండి గౌరవం పొందగలుగుతారు*

వంట మరియు పరిశుభ్రత

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
clipartpanda.com, clipartfest.com

ఆహారం లేకుండా మనం బ్రతకలేం.  అలాగే మంచి ఆరోగ్యం లేకుండా జీవించడం కష్టం.  ఈ శరీరానికి కావాలసిన పోషక పదార్ధాలు అన్నీ ఈ ప్రకృతి నుండి వస్తున్నాయి.  పండ్లను వండాల్సిన అవసరం లేకుండా తినొచ్చు.  బియ్యం, కూరగాయలు, మాంసం మొదలైన వాటిని వండుకొని తింటున్నాము.  వంట రుచిగా ఉన్నప్పుడే పిల్లలైనా, పెద్దలైనా ఇష్టపడతారు.  వంట చెయ్యడం నేర్చుకున్నప్పుడే చెయ్యి కోసుకోకుండా కూరగాయలు తరగగలం. స్టవ్‌ దగ్గర ప్రమాదాలు జరగకుండా వంట చెయ్యగలం. శరీరానికి కావలసిన విటమిన్లని అందేలా జాగ్రత్త తీసుకోగలం.

తల్లిదండ్రులకు అత్యవసరమై 10రోజులు ఊరు వెళ్ళారనుకోండి. మీకు వంట చేతనైతే తల్లిదండ్రులు వెళ్ళిన పని ప్రశాంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. హోటల్‌ ఆహారం తెచ్చుకోవలసిన అవసరం ఉండదు.  ఆరోగ్యం పాదవదు.  డబ్బు ఆదా అవుతుంది.  కోరుకున్న రుచులతో తినొచ్చు.  వంట నేర్చుకుంటే తల్లికి సహాయం చేయవచ్చు.  వివాహం తరువాత  కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.  మగవారు వంట నేర్చుకుంటే చిన్న పాపలతో ఇబ్బంది పడే భార్యకు లేదా ఉద్యోగానికి వెళ్ళే భార్యకు సహాయం చేయవచ్చు. భార్య ఊరెళ్ళినా ఇబ్బంది పడకుండా వంట చేసుకోవచ్చు. జీవించడానికి అవసరమైన వంటలను ఇంతవరకు నేర్చుకోని వారు నేటి నుండే నేర్చుకోండి.

పరిశుభ్రత మనిషి జీవితంలో ఒక భాగం.  అదిలేక పోతే ఆరోగ్యము పాడవుతుంది. పరిసరాలు దుర్గంధభరితంగా తయారవుతాయి. అంటు వ్యాధులు ప్రభలుతాయి. మొత్తం మానవ సమాజమే నశించిపోయే ప్రమాదముంది.  ఇందుకు అంటువ్యాధులు, చర్మ వ్యాధులను ఉదాహరణగా చెప్పవచ్చు.  పసిపిల్లలు త్వరగా రోగాల భారిన పడతారు.  కాబట్టి  ప్రతి విద్యార్ధి ముందుగా ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం నేర్చుకోవాలి.  చీపురుతో ఇల్లు ఊడవడం, వంట పాత్రలను కడుక్కోవడం, చెత్త దుమ్ము  ధూళిని తొలగించడం,  బట్టలు ఉతకడం వంటి వనులను నేర్చుకోవాలి.  అలవాటు లేని వారు అలవాటు చేసుకోవాలి.

   *వంట చేతగాకపోతే కష్టం, పరిశుభ్రత లేకపోతే కనా కష్టం*

జీవితం విలువ ఎంత?


ఈ జీవితాన్ని ఉపయోగించుకొని కొందరు మహాత్ములయ్యారు, మరికొందరు చెడ్డవారిగా మిగిలారు, ఇంకొందరు ఏమీ చెయ్యక జీవితం ముగించారు.

ఈ కథ చదివి మీ జీవితం విలువ ఎంతో మీరే చెప్పండి.

మహేష్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. కాలేజిలో చేరిన రెండు నెలలకే జడ పొడవుగా ఉందని నచ్చి ఒక అమ్మాయిని ప్రేమించేశాడు. ఒక మంచి రోజు చూసి ప్రొపోజ్‌ చేశాడు. కానీ ఆ అమ్మాయి '' ముందు బాగా చదువుకో, ఈ వయస్సులో ప్రేమేంటి'' అని చివాట్లు పెట్టింది. మహేష్‌ మనస్సు గాయపడింది. కాలేజీ నుండి మహేష్‌ విచారంగా ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ టిఫిన్‌, మంచినీళ్ళు తెచ్చి స్టూల్‌ మీద పెట్టి వెళ్లింది. మహేష్‌లో క్షణ క్షణానికి డిప్రెషన్‌ పెరిగిపోతోంది. గది సీలింగ్‌ వైపు చూసాడు, ఫ్యాన్‌ కనపడింది. వెంటనే లుంగీ తీసి ఫ్యాన్‌కి వేసి రెండో చివర మెడకు బిగించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో గాలిలో ఊగుతూఉంటే స్టూలు పైన ఉన్న గ్లాసు కాలికి తగిలి క్రింద పడింది. ఆ శబ్దానికి వాళ్ళ అమ్మ పరిగెత్తుకొని వచ్చింది. కొడుకును చూసి భర్తను రమ్మని కేకలు వేసింది. ఆ కేకలకు మహేష్‌ తండ్రి పరుగెత్తుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి మహేష్‌ ను కిందికి దించి మంచంపై పడుకోబెట్టారు. పలకరించడానికి స్నేహితులు చాలా మంది వచ్చారు. విషయం ప్రిన్నిపాల్‌ కు తెలిసి, ఉదయాన్నే పరామర్శించడానికి వచ్చాడు. ఆయన్ను చూడగానే మహేష్‌ తల్లి '' మార్కులు తగ్గితే ఆత్మహత్య చేసుకోవాలా, బిడ్డని చదవమని వత్తిడి చేయకండి'' అని పెద్దగా ఏడ్చింది. ప్రిన్సిపాల్‌ తెల్ల మొఖం వేసుకొని గదిలో ఉన్న మహేష్‌ దగ్గరికి వెళ్ళి ఏంటిరా ఇదంతా అని అడిగాడు. అమ్మకు  నా ప్రేమ విషయం తెలియదు సార్‌, తెలిస్తే తిడుతుంది, మీరు చెప్పకండి అని బ్రతిమాలాడు.

''సరే, లవ్‌ మరలా సక్సెస్‌ చేసుకుందువు గానీ ముందు చదువు సక్సెస్‌ చేసుకో '' అని ప్రిన్సిపాల్‌ లేచి బయటకు రాబోయాడు. మహేష్‌ ప్రిన్సిపాల్‌ చెయ్యి గట్టిగా పట్టుకొని ''సార్‌ మీరు మా క్లాసుకు వచ్చినప్పుడు ఈ జీవితం ఎంతో విలువైనది అన్నారు, అసలు ఈ జీవితం విలువెంత సార్‌?'' అని అడిగాడు.

రాత్రి మెడకు ఉరి వేసుకొని ఊగి అలసిపోయి ఉంటావు, ఈ రోజు రెస్ట్‌ తీసుకొని రేపు కాలేజీకి వచ్చి నన్ను కలువు అప్పుడు చెప్తాను అని వెళ్లిపోయాడు.

మహేష్‌ మరునాడు ఉదయాన్నే ప్రిన్సిపాల్‌ను కలిసాడు. మరలా ఈ జీవితం విలువెంత సార్‌ అని అడిగాడు. ఆయన ఒకె ఒకె అంటూ తన బీరువానుండి ఒక రాతి ముక్కను తీసి మహేష్‌ కు ఇచ్చి దీనిని నీ బంధువులెవరైనా కొంటారేమో కనుక్కొని రేపు జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పాడు. సరే సార్‌ అని మహేష్‌ ఆ రాత్రి నలుగురైదుగురు బంధువుల ఇండ్లకు వెళ్ళాడు. వాళ్ళు రాయిని ఎగాదిగా చూసి ఇందేంట్రా పిచ్చి రాయి తెచ్చావు అని పారవేయపోయారు. మహేష్‌ పారవేస్తే మా సార్‌ తిడతారు అని చెప్పి దాన్ని  తీసుకుని మరునాడు ప్రిన్సిపాల్‌కి జరిగింది చెప్పాడు.

ఏం బాధపడకు ఈ రోజు కూరగాయల మార్కెట్‌ కి వెళ్ళి కొంటారేమో కనుక్కోమని చెప్పాడు. తోడుగా స్నేహితులను కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. మహేష్‌ అలాగే చేశాడు. మార్కెట్‌లో ఒక వ్యాపారస్తుడు ఆ రాతి ముక్కను అటూ ఇటూ తిప్పి పాలిష్‌ పెట్టిస్తే బాగుంటుందని తలచి రెండు వందల రూపాయలకు కొంటానని అన్నాడు. మరునాడు అది విన్న ప్రిన్సిపాల్‌ చివరిగా ఒక టీచర్‌ని తోడు తీసుకొని రత్న వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళమన్నాడు.

రత్నవ్యాపారస్తులు ఆ ముక్కను జాగ్రత్తగా పరీక్షచేసి 10లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహేష్‌కు కళ్ళు తిరిగాయి. వెంటనే ప్రిన్సిపాల్‌ను కలుద్దామని టీచర్‌ను అర్ధించాడు. టీచర్‌ మహేష్‌ని రాత్రి 9 గం||ల సమయంలో ప్రిన్సిపాల్‌ వద్దకు తీసుకొని వెళ్ళాడు.

మహేష్‌ ప్రిన్సిపాల్‌తో, సార్‌ ఈ రాయి ద్వారా నాకేమి చెప్పాలనుకుంటున్నారని అడిగాడు.  ప్రిన్సిపాల్‌ అతని భుజంపై చెయ్యివేసి 'జీవితం విలువ ఎంతని అడిగావు' ఇదంతా నీకు అర్థం కావాలనే  చేశాను అని ఇలా వివరించాడు.

మనుషుల్లో మూడు రకాలు ఉంటారు.

మొదటి రకం:

నీ బంధువులు ఈ రాయి ఎందుకూ పనికిరాదని విసరివేసారు. అలాగే జీవితానికి విలువ  లేదని అనుకునే వాళ్ళు కూడా వారి జీవితాలను వృధా చేసుకుంటారు.

రెండవ రకం: 


వీళ్ళు కూరగాయల వ్యాపారిలా ఈ జీవితానికి కొంత విలువ ఉందనుకొనే వాళ్ళు ఏదో ఉద్యోగం లేదా పని చేసి నాలుగు డబ్బులు సంపాదించడం, పెళ్ళి, పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు ... చచ్చిపోవడంతో జీవితం ముగుస్తుంది.

మూడవ రకం: 

వీళ్ళు రత్న వ్యాపారి రత్నాన్ని గుర్తించినట్లు జీవితం విలువను పూర్తిగా గుర్తించినవారు. ఉహ తెలిసినప్పటి నుండి కష్టపడి, నీతి, నిజాయితీలతో జీవితాన్ని గడిపేవాళ్ళు చివరికి మహాత్ములుగా, సమాజానికి మార్గదర్శకులుగా మిగులుతారు.


- మరి మీ జీవితం విలువ ఎంత?-


పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in

ప్రేరణ

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
Designed by -Freepik.com

జీవితంలో పదవుల్లో, ఆటలు, పాటలు మొదలైన వాటిలో ఉన్నత స్థాయికి చేరినవారు తమ విజయం వెనుక తల్లిదండ్రులో, ఇతరుల ప్రేరణో ఉన్నట్లు చెప్పటం మనం వింటున్నాం. వ్యక్తి తన లక్ష్యాన్ని, తన అవసరాలు, కోరికలు, ఆధారంగా నిర్ణయించుకుంటాడు. వాటిని ప్రేరకములు అంటారు. ప్రేరకాలు చేసేపనిని ప్రేరణ అంటారు. ఇవి వ్యక్తిని కోరుకున్న గమ్యం  వైపుగా నడిపించడానికి, లక్ష్యం ఏర్పరచుకోని వారికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశిస్తాయి.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా స్నేహితులు లక్ష్యాన్ని ప్రేరిపిస్తే మంచి మార్పువస్తుంది. విద్యార్ధులు జీవితంలో విజయం సాధించడానికి స్వయంప్రేరణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • అయితే అందుకు క్రింది అంశాలను పాటించాలి.
  • సరైన లక్ష్యం ఏర్పరుచుకోవడం
  • లక్ష్య సాధన కోసమే సమయం ఉపయోగించడం
  • లక్ష్యసాధనకు అవసరమైన విజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకోవడం
  • అవరోధాలకు భయపడక ధైర్యంగా ముందుకు సాగడం

               
                          *మనసును మంచి లక్ష్యం వైపు ప్రేరిపిస్తే విజయం మీ ముంగిట్లోనే*

చదువంటే ఆసక్తి లేకపోవడం

Source: behappy.org.in
http://classroomclipart.com/

కొంతమంది విద్యార్ధులు చదువంటే ఇష్టం లేదంటారు. చదువు విలువ, జీవితం విలువ తెలియక అలా అంటారు. కారణం ఉన్నా, లేకపోయినా నష్టపోయేది మాత్రం ఆసక్తిలేనివారే. ఈ విషయాన్ని విద్యార్ధులు గమనించాలి.

ఆసక్తి లేకపోవడానికి కారణాలు
  • సరిఅయిన లక్ష్యం లేకపోవడం
  • జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం
  • చెడు అవాట్లకు బానిస కావడం
  • పనిలేకుండా తిరుగుదామని అనిపించడం
  • పాఠశాల / కళాశాల వాతావరణం
  • ఇష్టంలేని కోర్సులో చేర్చడం వల్ల
  • సబ్జెక్టు కష్టంగా ఉండటం
  • టీచర్లు పాఠాలు సరిగా చెప్పకపోవడం
ఇంకా
  • కుటుంబ సమస్యలు
  • ఆరోగ్య సమస్యలు
  • ఆత్మనూన్యతాభావం
  • ఆత్మ స్థైర్యం లేకపోవడం
  • ఇంటిపై బెంగ
  • మనసిక వత్తిడి
  • టీజింగ్/ర్యాగింగ్


 పరిష్కారమార్గం
  • చదువు వల్లఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.
  • చదువుకోని వారు బ్రతకడానికి ఎలాంటి పను చేస్తున్నారో గమనించండి.
  • చదువుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించండి.
  • తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను గుర్తుంచుకోండి.
  • మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి.


*చదువుకో, బ్రతుకును దిద్దుకో*

Saturday, March 30, 2019

పరీక్షలకు తయారవడం ఎలా?

Posted by: Life Skills Sankar
Source: behappy.org.in
https://openclipart.org


ఎల్‌.కె.జి. నుండి పి.జి. పూర్తయ్యేలోపు కనీసం 100 సార్లు పరీక్షలు వ్రాస్తారు.  కాని పి.జి చివరి సంవత్సరంలో కూడా కొందరు విద్యార్ధులకు పరీక్షలకు ఎలా తయారుకావాలో తెలియడం లేదు.  మంచి మార్కులు రావాలంటే విద్యార్ధు లుసంవత్సరం మొదటి నుండి ప్రణాళిక ఏర్పరచుకోవాలి. సంవత్సరం మధ్యనుండి మొదలు పెడదాంలే అనుకొంటే ఫలితం కూడా అలానే ఉంటుంది. 

నీవు, నీ స్నేహితులతో కలసి వన్‌డే క్రికెట్‌ ఆడుతున్నావనుకో. మీరు గెలవడానికి 235 పరుగులు చేయాలనుకోండి. ఆ ! ఏముందిలే, ఎదుటి వారిపై తేలిగ్గా ఆ స్కోరు చేస్తాం అని మొదటి ఇరవై ఓవర్లు సరిగా ఆడలేదనుకోండి, అందువల్ల మిగిలిన 30 ఓవర్లలో ఎక్కువ పరుగు చేయాల్సి వస్తుంది. రన్‌రేట్‌ ఎక్కువ చేయాల్సివస్తే ఆడే వాళ్ళపై వత్తిడి  పెరుగుతుంది. ఆదుర్ధా, హడావుడి పడతారు. కొన్ని వికెట్లు పడిపోవచ్చు. దాంతో మరింత టెన్షన్‌. అసలు గెలుస్తామా అన్న అనుమానం వస్తుంది. ఇదంతా మొదటి ఇరవై ఓవర్లలో శ్రద్ధ చూపక పోవడమే. మొదటి నుండి జాగ్రత్త లేకపోతే చదువైనా అంతేమరి. కాబట్టి సంవత్సరం మొదటి నుండి శ్రద్ధగా వుంటేనే మంచి మార్కులు వస్తాయి.

వ్యాసాలు నేర్చుకోవడానికి ‘కీ’ షీటు పద్ధతి

వ్యాసాలు నేర్చుకోవడానికి ‘కీ’ షీటు పద్దతి ఎంతో సులువైనది. ఒక వ్యాస ప్రశ్నకు సమాధానం నేర్చుకోవడానికి క్రింది విధంగా చెయ్యండి.

  • నిర్వచనం వ్రాయండి.
  • సైడ్‌ హెడ్డింగ్స్‌ వ్రాయండి.
  • ప్రతీ సైడ్‌ హెడ్డింగ్‌ ఎదురుగా నేర్చుకోవల్సిన ముఖ్యమైన పదాలు వ్రాసుకోండి. ఆ పదాలను చదివితే వాక్యాలు గుర్తుకురావాలి.
  • చిత్రపటాలు, పట్టికలు ఉంటే సాధన చెయ్యండి.
ఇప్పుడు నోట్స్‌ లేదా టెక్స్ట్ బుక్ మూసి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. పరీక్షల సమయంలో ఈ ‘కీ’ షీటు చదివితే సిలబస్‌ త్వరగా పూర్తవుతుంది. వ్యాసాల నుండే చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు గుర్తుంచుకోవచ్చు.

సమాధానాలు వ్రాయడం ఒక కళ
  • ఎంత చదివినా, ఎంత బాగా గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు రావు. కాబట్టి క్రింది విషయాలను చదివి గుర్తుంచుకొని పాటించండి.
  • చేతివ్రాత బాగుండాలి 
  • నిర్వచనం ఉంటే యధాతధంగా వ్రాయాలి.
  • చిన్న ప్రశ్నలకు వ్రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా వ్రాయాలి.

వ్యాస ప్రశ్నకు సమాధానాలను క్రింద సూచించిన విధంగా వ్రాయాలి.
  • జవాబులో నిర్వచనం వుంటే ముందుగా అది వ్రాయాలి.
  • Side headings పెట్టాలి. Underline  చెయ్యాలి.
  • జవాబులో ముఖ్యమైన పదాలను కూడా Underline చేయాలి.
  •  అవసరమైన చోట చిత్ర పటాలను (Figures) గీచి, భాగాలు గుర్తించి వివరించాలి.
  • పట్టికలు వుంటే వాటిని కూడా వేయాలి.
  • పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
మీరు ఎంతబాగా చదివినా, పరీక్షలకు ఎలా తయారవ్వాలో తెలియకపోతే చాలామార్కులు నష్టపోతారు. అందుకే మీ కోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.

సంవత్సరం మొదటినుండి చివరివరకు
  • పాఠాలు శ్రద్ధగా వినాలి.
  • ఏం విన్నారో అర్ధం చేసుకోండి.
  • అర్ధంకానివి అడిగి తెలుసుకోండి.
  • ఏరోజు విన్నవి ఆరోజే చదవండి.
  • పాఠం వింటూ ముఖ్యమైన విషయాలు వ్రాసుకోండి.
  • చిత్రపటాలు, పట్టికలు నేర్చుకోండి.

ఇష్టమైన సబ్జెక్టులు
కొంతమంది విద్యార్ధులు వారికి ఇష్టమైనవి లేదా తేలిగ్గా ఉండే సబ్జెక్టులే ఎక్కువసమయం చదువుతుంటారు. అందువల్ల కొన్నిసార్లు వారికి కష్టమనిపించే సబ్జెక్టులలో ఫెయిల్‌ అవుతుంటారు లేదా తక్కువ మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి మంచి మార్కులు రావాలంటే కష్టమైన సబ్జెక్టులకే ఎక్కువ సమయం కేటాయించాలి.

ఇష్టపడడానికి కారణాలు
  • నేర్చుకోవడానికి తేలిగ్గా ఉండటం
  • చిన్నతనం నుండి ఒక అభిప్రాయం ఏర్పడటం
  • టీచర్‌ చక్కగా బోధించడం
  • జన్యువులు
  • టీచర్‌ అంటే ఇష్టం

ఇష్టంలేని సబ్జెక్టులు

ఒక సబ్జెక్టు పట్ల ఇష్టం లేకపోతే మార్కులు తగ్గి విద్యార్ధులు నష్టపోతారు. కాబట్టి శ్రద్ధగా వినడం, ఎక్కువ సార్లు రివిజన్‌ చెయ్యడం, చూడకుండా వ్రాయడం, అవసరమైతే ట్యూషన్‌ పెట్టించుకోవడంవల్ల మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. 

ఇష్టం లేకపోవడానికి కారణాలు
  • నేర్చుకోవడానికి కష్టంగా ఉండటం.
  • అర్థంకాక పోవడం.
  • టీచర్‌ సరిగా చెప్పకపోవడం.
  • చిన్నతనంలోనే ఒక అభిప్రాయం ఏర్పడటం.
  • టీచర్‌  అంటే ఇష్టం లేకపోవడం

పరీక్షలకు ఒక నెల ముందు
  • సబ్జెక్టున్నింటికి సమయం కేటాయించి ప్రణాళిక వేసుకోవాలి.
  • ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి.
  • కష్టమైన, ఇష్టంలేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ప్రతిరోజు అవసరమైనంత నిద్ర పోవాలి.
  • ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
  • చల్లని పదార్ధాలు తినడం, త్రాగడం చేయకండి.

పరీక్షలకు రెండు రోజుల ముందు
  • మొదటి పరీక్ష కోసమే చదవండి.
  • గతంలో చదివినంతవరకే రివిజన్‌ చెయ్యండి.
  • కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి.
  • సరిపోయినంత నిద్రపొండి.
  • కష్టపడి చదవడమేకాని, ఫలితం మీ చేతుల్లో లేదని గుర్తుంచుకోండి.
  • ఎప్పుడూ మనసు  సంతోషంగా ఉంచుకోండి.

పరీక్ష రోజున
  • పరీక్ష సమయానికి కనీసం గంటముందు చదవడం ఆపండి.
  • పరీక్ష వ్రాయడానికి కావలసినవి సిద్ధం చేసుకోండి.
  • స్నేహితులతో సరదాగా మాటు తప్పించి పరీక్ష గురించి చర్చించకండి.
  • పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందుగా చేరండి.

పరీక్ష హాలులో
  • 5 నుండి 10 ని॥లు కళ్ళు మూసుకుని  కూర్చోండి.
  • సమాధాన పత్రం ఇవ్వగానే హాల్‌టికెట్‌ నంబర్‌ స్పష్టంగా కనబడేలా వ్రాయండి. కొట్టివేతలు  
  • ఉంటే ఇన్విజిలేటరుతో సంతకం చేయించుకోండి.
  • ఇన్విజిలేటరు ఇచ్చే సూచనలు శ్రద్ధగావిని పాటించండి.
  • పరీక్షకు సంబంధించిన సబ్జెక్టు మెటీరియల్‌, ఇతరములు చిన్నముక్క కూడా దగ్గర ఉంచుకోకండి. 
  • ప్రశ్నాపత్రం పైనగాని, బెంచ్‌, పాడ్‌లపైనా ఏమీ వ్రాయకండి. తనిఖీబృందాలు మిమ్మల్ని బుక్‌ చెయ్యవచ్చు.
  • ప్రశ్నాపత్రాన్ని శ్రద్దగా చదవండి.
  • తేలికగా ఉన్న ప్రశ్నకు మొదట సమాధానం వ్రాయండి.
  • మొదటి పేజీ నెమ్మదిగా అందంగా వ్రాయండి.
  • ప్రశ్నలు  కష్టంగా అనిపిస్తే కంగారు పడొద్దు, మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తుంది.
  • సమాధాన పత్రంలో చివరి పేజీని ‘చిత్తుగా’ వాడుకోండి.
  • సమాధానాలు వ్రాయడం అయిపోయాక ప్రశ్నల నంబర్లు సరిచూచుకోండి.
  • సమయం మిగిలితే వ్రాసింది పరిశీలించండి.

పరీక్ష హాలునుండి బయటకు వచ్చాక

స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకండి.
ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకోండి.
తరువాతి పరీక్షకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టండి.

పరీక్షలన్ని అయ్యాక
  • నా బాధ్యత నేను నిర్వర్తించాను, ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
  • మార్కులు తగ్గుతాయనిపిస్తే, దాని ప్రకారం భవిష్యత్‌ ప్రణాళిక వేసుకోవాలి.

ఫలితాలు తెలిశాక
  • వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
  • ఫెలయిన విద్యార్ధులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బ్రతకడానికి చాలా మార్గాులున్నాయని అర్ధం చేసుకోవాలి. అంతేకాక మరలా  వ్రాసి పాస్‌ కావచ్చని గుర్తుంచుకోవాలి.
  • జీవితంలో విజయం సాధించిన వారి చరిత్రలు చదవండి.
  • చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు. తెలివిగల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.

ఆటపాటలు ఎంతో అవసరం 

మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆటపాటలు చాలా అవసరం. ప్రతిరోజు కనీసం అరగంట నుండి గంట సేపు ఆడుకోవాలి. చదువుతోపాటు వారికిష్టమయిన ఏదో ఒకటి అంటే సంగీతం, చిత్రలేఖనం, నృత్యం లాంటివి నేర్చుకోవాలి. ఆటపాటలు, భౌతిక, మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తాయి. అందువల్ల విద్యార్ధులు ఎక్కువ శ్రమ చేయగుగుతారు. చురుకుగాను ఉంటారు.

*ప్రయత్నించు, సాధించు, విజేతవు నువ్వే*

స్నేహితులు

Posted by: Life Skills Sankar
Source: behappy.org.in
                                               http://www.clipartkid.com
స్నేహితులంటే మన మంచికోరేవారు, మనకు మంచిచేసేవారు. కాని ఈ మధ్య కొందరు స్నేహితుల పేరుతో ప్రతిరోజూ పాఠాలు వింటుంటే కదిలించడం, ఇంటికి వచ్చి బయటకు తీసుకువెళ్ళడం, చెడు అలవాట్లు నేర్పడం, ప్రోత్సహించడం మొదలైనవి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్నేహితులు కారు, శత్రువులకన్నా ప్రమాదకారులు.

మీ స్నేహితులను పరిశీలించండి

  • స్వార్థం ఎక్కువా?
  • తరచు డబ్బులు ఖర్చుపెట్టిస్తున్నారా?
  • తరచూ మీ సాయం అడుగుతున్నారా?
  • చెడుఅలవాట్లు ఉన్నాయా?
  • మీ సమయాన్ని వృధా చేస్తున్నారా?
  • పాఠాలు విననివ్వడం లేదా?
  • పనికిమాలిన మాటలతో కాలం గడుపుతున్నారా?
  • చదువులో వెనకబడ్డారా?
  • సరైన లక్ష్యం లేకుండా ఉన్నారా?
  • నైతిక విలువలు పాటించడంలేదా?
  • తరచూ అబద్ధాలు చెబుతున్నారా?
  • దొంగతనాలు చేస్తున్నారా?
  • ఇతరుల పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నారా?


వీటిలో కనీసం ఆరు విషయాలలో మీ సమాధానం ‘అవును’ అయితే అలాంటి వారితో స్నేహం మానండి.

*స్నేహితుడంటే ఓ మార్గదర్శి*