పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
జీవితంలో పదవుల్లో, ఆటలు, పాటలు మొదలైన వాటిలో ఉన్నత స్థాయికి చేరినవారు తమ విజయం వెనుక తల్లిదండ్రులో, ఇతరుల ప్రేరణో ఉన్నట్లు చెప్పటం మనం వింటున్నాం. వ్యక్తి తన లక్ష్యాన్ని, తన అవసరాలు, కోరికలు, ఆధారంగా నిర్ణయించుకుంటాడు. వాటిని ప్రేరకములు అంటారు. ప్రేరకాలు చేసేపనిని ప్రేరణ అంటారు. ఇవి వ్యక్తిని కోరుకున్న గమ్యం వైపుగా నడిపించడానికి, లక్ష్యం ఏర్పరచుకోని వారికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశిస్తాయి.
Source: behappy.org.in
Designed by -Freepik.com
జీవితంలో పదవుల్లో, ఆటలు, పాటలు మొదలైన వాటిలో ఉన్నత స్థాయికి చేరినవారు తమ విజయం వెనుక తల్లిదండ్రులో, ఇతరుల ప్రేరణో ఉన్నట్లు చెప్పటం మనం వింటున్నాం. వ్యక్తి తన లక్ష్యాన్ని, తన అవసరాలు, కోరికలు, ఆధారంగా నిర్ణయించుకుంటాడు. వాటిని ప్రేరకములు అంటారు. ప్రేరకాలు చేసేపనిని ప్రేరణ అంటారు. ఇవి వ్యక్తిని కోరుకున్న గమ్యం వైపుగా నడిపించడానికి, లక్ష్యం ఏర్పరచుకోని వారికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశిస్తాయి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా స్నేహితులు లక్ష్యాన్ని ప్రేరిపిస్తే మంచి
మార్పువస్తుంది. విద్యార్ధులు జీవితంలో విజయం సాధించడానికి స్వయంప్రేరణ ఎంతగానో
ఉపయోగపడుతుంది.
- అయితే అందుకు క్రింది అంశాలను పాటించాలి.
- సరైన లక్ష్యం ఏర్పరుచుకోవడం
- లక్ష్య సాధన కోసమే సమయం ఉపయోగించడం
- లక్ష్యసాధనకు అవసరమైన విజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకోవడం
- అవరోధాలకు భయపడక ధైర్యంగా ముందుకు సాగడం
*మనసును మంచి లక్ష్యం వైపు ప్రేరిపిస్తే విజయం
మీ ముంగిట్లోనే*