Designed by Smithytomy - Freepik.com
సాధారణంగా ఈ దేహం గురించి పెద్దగా ఆలోచించం. ఏదైనా అవయం పని చెయ్యకపోతే మాత్రం అప్పడు గుర్తొస్తుంది. ఒక అవయం లేకుండా జీవిస్తున్న వాళ్లకు దాని విలువ బాగా తెలుసు. మనం కూడా ఒక్క వారం రోజులు ఒంటి కాలుతో జీవించి చూస్తే , కాలు విలువ బాగా తెలుస్తుంది.
అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తె మన లక్ష్యాన్ని తేలిగ్గా సాధించగలం. కాబట్టి మనం వాటి విలువ తెలిసి జాగ్రత్త తీసుకోవాలి. వాటి విలువ ఎంతో తెలియాలంటే క్రింది పట్టికను పూర్తి చెయ్యండి.
దేహ భాగం (విలువ, లక్షల రూపాయల్లో)
మెదడు
గుండె
ఊపిరితిత్తులు
నాడీమండలం
మూత్రపిండాలు
లివరు
కళ్ళు
నాలుక
చేతులు
కాళ్ళు
మిగిలినవి
ఈ పట్టికనుబట్టి శరీరానికి విలువ కట్టలేమని, మన దేహం విలువ అనంతమని తెలుస్తోంది. మనిషి ఇంతవరకు రూపొందించలేని ఓ అద్భుత వ్యవస్థ - ఈ దేహం. విలువ కట్టలేని ఈ దేహాన్ని ఎలాంటి పనులకు ఉపయోగిస్తున్నామో ప్రతి వక్కరం గమనించాలి.
*ఈ దేహం విలువ ఎంత?*
No comments:
New comments are not allowed.