Sunday, March 31, 2019

వంట మరియు పరిశుభ్రత

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
clipartpanda.com, clipartfest.com

ఆహారం లేకుండా మనం బ్రతకలేం.  అలాగే మంచి ఆరోగ్యం లేకుండా జీవించడం కష్టం.  ఈ శరీరానికి కావాలసిన పోషక పదార్ధాలు అన్నీ ఈ ప్రకృతి నుండి వస్తున్నాయి.  పండ్లను వండాల్సిన అవసరం లేకుండా తినొచ్చు.  బియ్యం, కూరగాయలు, మాంసం మొదలైన వాటిని వండుకొని తింటున్నాము.  వంట రుచిగా ఉన్నప్పుడే పిల్లలైనా, పెద్దలైనా ఇష్టపడతారు.  వంట చెయ్యడం నేర్చుకున్నప్పుడే చెయ్యి కోసుకోకుండా కూరగాయలు తరగగలం. స్టవ్‌ దగ్గర ప్రమాదాలు జరగకుండా వంట చెయ్యగలం. శరీరానికి కావలసిన విటమిన్లని అందేలా జాగ్రత్త తీసుకోగలం.

తల్లిదండ్రులకు అత్యవసరమై 10రోజులు ఊరు వెళ్ళారనుకోండి. మీకు వంట చేతనైతే తల్లిదండ్రులు వెళ్ళిన పని ప్రశాంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. హోటల్‌ ఆహారం తెచ్చుకోవలసిన అవసరం ఉండదు.  ఆరోగ్యం పాదవదు.  డబ్బు ఆదా అవుతుంది.  కోరుకున్న రుచులతో తినొచ్చు.  వంట నేర్చుకుంటే తల్లికి సహాయం చేయవచ్చు.  వివాహం తరువాత  కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.  మగవారు వంట నేర్చుకుంటే చిన్న పాపలతో ఇబ్బంది పడే భార్యకు లేదా ఉద్యోగానికి వెళ్ళే భార్యకు సహాయం చేయవచ్చు. భార్య ఊరెళ్ళినా ఇబ్బంది పడకుండా వంట చేసుకోవచ్చు. జీవించడానికి అవసరమైన వంటలను ఇంతవరకు నేర్చుకోని వారు నేటి నుండే నేర్చుకోండి.

పరిశుభ్రత మనిషి జీవితంలో ఒక భాగం.  అదిలేక పోతే ఆరోగ్యము పాడవుతుంది. పరిసరాలు దుర్గంధభరితంగా తయారవుతాయి. అంటు వ్యాధులు ప్రభలుతాయి. మొత్తం మానవ సమాజమే నశించిపోయే ప్రమాదముంది.  ఇందుకు అంటువ్యాధులు, చర్మ వ్యాధులను ఉదాహరణగా చెప్పవచ్చు.  పసిపిల్లలు త్వరగా రోగాల భారిన పడతారు.  కాబట్టి  ప్రతి విద్యార్ధి ముందుగా ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం నేర్చుకోవాలి.  చీపురుతో ఇల్లు ఊడవడం, వంట పాత్రలను కడుక్కోవడం, చెత్త దుమ్ము  ధూళిని తొలగించడం,  బట్టలు ఉతకడం వంటి వనులను నేర్చుకోవాలి.  అలవాటు లేని వారు అలవాటు చేసుకోవాలి.

   *వంట చేతగాకపోతే కష్టం, పరిశుభ్రత లేకపోతే కనా కష్టం*