Saturday, March 30, 2019

చేతివ్రాత

Source: behappy.org.in

చేతివ్రాత విద్యార్ధి తలరాతనే మార్చగలదు. మీరు వ్రాసిన సమాధానాలను మూల్యాంకనం, చేసి మార్కు వేసే టీచర్లు, చేతి వ్రాత బాగాలేకపోతే వ్రాసింది అర్ధం చేసుకోలేరు. చిరాకు కలుగుతుంది. మీరు సమాధానాలు బాగా వ్రాసినా కూడా మార్కులు తగ్గిపోతాయి. ఒకే విధంగా సమాధానం వ్రాసిన ఇద్దరు విద్యార్ధులను తీసుకుంటే వారిలో చేతివ్రాత బాగాలేని విద్యార్ధి కనీసం నూటికి అయిదు మార్కులు నష్టపోతాడు. ఈ నష్టం విద్యార్థి భవిష్యత్తునే మార్చివేస్తుంది. కాబట్టి చేతివ్రాత బాగాలేనివారు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. 


  •  వ్రాసింది చదవడానికి అర్ధం కావాలి. 
  • పదాలోని అక్షరాల మధ్య తగినంత ఖాళీ ఉండాలి. 
  • పదానికి ` పదానికి మధ్య తగినంత ఖాళీ ఉండాలి. 
  • వాక్యానికి ` వాక్యానికి మధ్య తగినంత ఖాళీ ఉండాలి. 
  • వాక్యాలను వంకరలేకుండా వ్రాయాలి. 
  • అక్షరాలు మరీ పెద్దవిగా ఉండకూడదు. మరీ చిన్నవిగాను ఉండకూడదు. 
  • అక్షరాలకు కొమ్ములు ఇవ్వడం అలవాటయితే ఆ కొమ్ములు పై లైను లేదా క్రింది లైను అక్షరాల మీదకు వెళ్ళి వ్రాసింది అర్ధంకాదు. 


చేతివ్రాత ఓ మానసిక ప్రక్రియ. చేతినందున్న కండరాలు, వాటి పటుత్వం, మనిషి ఆలోచనలు`వీటి మొత్తం సమాహారమే చేతివ్రాత. పిల్లలకు ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు కండరాలకు పటుత్వం ఏర్పడదు. అందువల్ల వాటి కదలికపై నియంత్రణ ఉండదు. అనుకున్న విధంగా వ్రాయడం కష్టం. 

చేతివ్రాతను విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. ఇది వ్యక్తుల మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి తోడ్పడుతుంది. చేతివ్రాతలో అక్షరాల రూపం, కొమ్ములు ఇందుకు ఉపయోగపడతాయి. 

చేతివ్రాత నైపుణ్యాన్ని, పెన్ను లేదా పెన్సిల్‌ను పట్టుకునే విధానం, విద్యార్థి భంగిమ, అక్షరాల స్పష్ఠత, పరిమాణం, కొమ్ములు ఆధారంగా నిర్ణయిస్తుంది. చేతివ్రాత విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందించడానికి ఉపకరిస్తుంది. ఇంకా మానసికలోపాను నివారించడానికి కూడా వీలవుతుంది. 

                                    *చేతిరాతను మార్చుకో, తలరాత మారుతుంది*


సంబంధిత వెబ్ సైట్లు
http://www.handwritingworksheets.com/
http://www.google.co.insearch?q=handwriting&
hl=en&tbo=u&tbm=isch&source=
univ&sa=X&ei=_4D3UPrRNceNrgeLsIG4Ag&sqi=2&ved=0CDcQs
AQ&biw=1366&bih=664
http://en.wikipedia.org/wiki/Handwriting
http://www.handwritingforkids.com/
http://www.handwritingforkids.com/handwrite/index.htm
http://www.writerightindia.com/
http://www.slate.com/articles/arts/books/2012/11/typing_replaces_handwriting_philip_hensher_s_the_missing_ink_reviewed.html