సమయం విలువ తెలుసుకోవాలంటే క్రింది పట్టికను పూర్తి చెయ్యండి.
ఒక మనిషి 100 సం||లు జీవించాడనుకోండి. అప్పుడు మనకు 100 *365 = 36,500 రోజుల జీవిత కాలం ఉంటుంది.
ఈ కాలాన్ని మనం ఉపయోగించుకొనే విధానం (సుమారుగా)
*1) మొదటి 20 సం||లు,
చివరి 30 సం||లు 50*365 = 18,250 రోజులు
మొత్తం 50 సం||లు తీసివేయండి
2) మిగిలిన 50 సం||లలో
నిద్రపోవడానికి రోజుకు
సరాసరి 8 గం||ల చొప్పున
(రోజులో మూడోవంతు) 50*1/3*365 = 6,083 రోజులు
3) కాలకృత్యాలు స్నానం, తయారవడం
తినడం, రోజుకు 3 గం|| చొప్పున
(రోజులో ఎనిమిదోవంతు) 50*1/8*365 = 2,281 రోజులు
4) టి.వి, సినిమాలు, షికార్లు
కబుర్లు, ఫోన్, వాదనలు, తగాదాలు
రోజుకు 3 గంల చొప్పున 50*1/8*365 = 2,281 రోజులు
(ఎనిమిదోవంతు)
5) ఫంక్షన్లు, రోగాలు, ప్రమాదాలు
మొ||వి సంవత్సరానికి 20 రోజుల
చొప్పున 50 సం||లకు 50*20 = 1,000 రోజులు
మొత్తం = 29,895 రోజులు
** చివరికి మిగిలింది (36,500 - 29,895) = 6,605 రోజులు
* 1 నుండి 20 సం||ల వయసు వరకు నేర్చుకొంటూవుంటాము. 71 నుండి 100 వరకు మనపని మనం చేసుకోగలిగితే చాలు.
** ఈ సమయాన్ని కూడా ఉద్యోగంలోనో, మరేదో ఒక పనికోసం ఉపయోగిస్తాం. మనల్ని తీర్చిదిద్దు కోవడం కూడా ఈ సమయంలోనే చేసుకోవాలి. అంటే మనకున్న సమయం ఎంత! కేవలం 6,605 రోజులు.
ఒక్కరోజు విలువ ఎంత ?
ఒక్క గంట విలువ ఎంత?
*ఆలోచించండి*
Source: behappy.org.in