Sunday, March 31, 2019

క్రమశిక్షణ

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
Designed by- Freepik.com


మనిషి తన లక్ష్యం సాధించడానికి క్రమశిక్షణ ఎంతో అవసరం. చదువు సంధ్యలేని పశుపక్ష్యాదులు క్రమబద్ధమైన జీవితం గడుపుతున్నాయి. చదువు, తెలివితేటలు ఉండికూడా కొందరు మనుషులు క్రమశిక్షణతో జీవించలేక పోతున్నారు. 

క్రమశిక్షణతో జీవించడం అంటే కొందరు శిక్షలాగా భావిస్తున్నారు. అదికేవలం మన జీవితం బాగుండానికే అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణతో మెలిగితే ఎన్నోలాభాలు ఉన్నాయి. ఉదాహరణకు నిబంధనలు లేకుండా ఆటలపోటి నిర్వహించామనుకోండి. అది రసాభాసవుతుంది. అలాగే మార్గదర్శక సూత్రాలు లేకుండా, ఉన్నా పాటించకపోతే సామాజిక జీవనం అశాంతితో అల్లాడుతుంది. జీవితాలకు రక్షణ కరువవుతుంది.

అయితే విద్యార్ధులకు క్రమశిక్షణ నేర్పడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరియైన పద్ధతులను అవలంభించాలి. అలాకానట్లయితే జీవితాన్ని తీర్చిదిద్దే క్రమశిక్షణ విద్యార్ధులకు శిక్షలాగే అనిపించుతుంది.  క్రింది సూచనలను పాటిస్తే విద్యార్ధులు జీవితంలో విజేతలుగా నిలుస్తారు. 


పాటించాల్సినవి

  • ఉదయాన్నే మరుగుదొడ్డికి వెళ్ళడం, పళ్ళుతోముకోవడం, స్నానంతో శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం
  • నియమబధ్దంగా ఆహారం తీసుకోవాలి.
  • రుచికోసం అతిగా తినకూడదు, శరీరానికి అవసరంలేని ఆహారాన్ని తీసుకోకూడదు.
  • మంచి అలవాట్లు చేసుకోవాలి.
  • ఇంటా బయట సమాజిక నిబంధనలను పాటించాలి
  • చట్టాలకు లోబడి ప్రవర్తించాలి.
  • సత్యం, ధర్మం, న్యాయాలను కాపాడాలి.
  • మృదువుగా మాట్లాడాలి.
  • ఇతరులకు హాని తలపెట్లకూడదు.
  • ఇతరులకు చెయ్యగలిగిన సహాయం చెయ్యాలి.
  • ఏరోజు చెప్పినవి ఆరోజే చదువుకోవాలి.
  • హోంవర్కు చెయ్యాల్సిన సమయంలోనే పూర్తి చేయాలి.
  • రహదారి నియమాలను పాటించాలి.


లాభాలు 
  • ఆరోగ్యం బాగుంటుంది.
  • మంచి మార్కులతో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
  • సమాజంలో ఓ మంచి మనిషిగా పేరు పొందవచ్చు.
  • తల్లిదండ్రులు గర్వపడేలా జీవించవచ్చు.
  • చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.


*క్రమ శిక్షణలేని జీవితం ఓ తెగిన గాలిపటం *