Saturday, March 30, 2019

ఇంటిపై బెంగ

Source: behappy.org.in
http://classroomclipart.com/

ఇంత వయసు వచ్చాక ఇల్లేంటి, ఎక్కడికైనా వెళతాం, ఎక్కడైనా ఉంటాం అనేవాళ్ళు ఈరోజుల్లో ఎక్కువ. అయితే రెండవ రకం ఉన్నారు, పాతిక కిలోమీటర్ల దూరంలో హాస్టల్లో ఉండాలంటే చాలు, పారిపోయి ఇంటికొస్తారు.

వింటానికి తమాషాగా ఉన్నా వాళ్ళ బాధ వాళ్ళది. ఇది తాత్కాలిక మానసిక అస్థిరత. ఈ బెంగకు కారణాలు చూద్దాం.

కారణాలు

  • కొత్త వాతావరణం
  • మొదటిసారి హాస్టల్‌లో ఉండటం
  • ఇంటి నుండి చాలా దూరంలో ఉండటం
  • మార్కుల్లో వెనుకబడటం
  • టీచర్లంటే ఇష్టంలేకపోవడం
  • టీచర్లంటే భయం
  • సబ్జెక్టు కష్టంగా ఉండటం
  • పరీక్షలంటే భయం
  • చదువంటే ఆసక్తిలేకపోవడం
  • మానసిక వత్తిడి
  • టీజింగ్‌ / ర్యాగింగ్‌
  • కుటుంబ సమస్యులు
  • ప్రేమ వ్యవహారం
  •  జీవితం విలువ తెలియకపోవడం


నష్టాలు

  • చదువు ఆగిపోతుంది.
  • భవిష్యత్తు పాడవుతుంది.


పరిష్కార మార్గాలు

  • ఇంటి పై బెంగ నుండి బయట పడటానికి చాలా మార్గాలు ఉన్నాయి.
  • ఈ బెంగ కొద్ది రోజులే ఉంటుందని అర్ధంచేసుకోండి.
  • వంటరిగా ఉండకండి.
  • ఉద్యోగం కోసమైనా దూరంగా ఉండాల్సిందే నని గుర్తుంచుకోండి.
  • బెంగ తగ్గేవరకు ఎక్కువసార్లు ఇంటికి వెళ్ళిరండి.
  • హాస్టల్లో మంచి స్నేహితులను ఎన్నుకోండి.
  • మార్కుల కోసం ఆలోచించకండి కొంత కాలం సంతోషంగా ఉండటానికి మంచి మార్గాలు ఎన్నుకోండి.
  • మంచి సంగీతం, పాటలు వినండి.
  • ఆటలు ఆడటం, కొత్తవి నేర్చుకోవడం చేయండి. (డ్యాన్స్‌, డ్రాయింగ్‌ మొ॥వి)
  • అవసరమైతే సైకాలజిస్ట్‌ సలహా తీసుకోండి, హోమియో మందులు వాడుకోండి.


*బాధను తాత్కాలికంగా ఓర్చుకోండి. భవిష్యత్తు బాగుంటుంది*

సంబంధిత వెబ్ సైట్లు

http://en.wikipedia.org/wiki/Homesickness
http://pediatrics.aappublications.org/content/119/1/192.full
http://www.wikihow.com/Deal-With-Homesickness