Source : http://www.behappy.org.in/index.php/site/index#
మనిషి
తయారు చేసిన ఒక బైకు
లేదా కారు నడపాలంటే
ముందుగా నేర్చుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలి. సిగ్నల్స్ గురించి తెలుసుకోవాలి. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణాలు కూడా పోవచ్చు.
మనిషి
తయారు చేసిన ఒక వాహనాన్ని
నడపడానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మరి సంక్లిష్టమైన
మనసున్న మన శరీరం అనే
వాహనాన్ని ఉపయోగించి జీవితాన్ని నడపడానికి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! ఈ జీవితాన్ని నడుపుకోవడం తెలియకుండానే జీవిస్తే ఇక్కడా ప్రమాదాలు జరుగుతాయి. సమస్యల్లో
చిక్కుకోవడం, ఇంటా బయటా సంబంధాలు దెబ్బతినడం జరుగుతుంది.
ఆరోగ్యం పాడై జీవితం అశాంతిగా
తయారవుతుంది.