Sunday, May 5, 2019

ఇప్పటికే చాలా మంది భవిష్యత్తును చిదిమేసారు

అశాస్త్రీయంగా చదివిస్తే మార్కులు వస్తాయా? విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకోగలుగుతారా?

వేలు, లక్షలు ఫీజు కింద వసూలు చేసి పనికిరాని విద్యార్థులను సమాజానికి అందించడానికి వీళ్లకు అధికారం ఎవరిచ్చారు? ఈ నేరం క్షమార్హం కాదు. వీళ్లకు కొమ్ము కాసేవారూ క్షమార్హులుకారు.


కొన్ని కళాశాలల్లో మేనేజ్మెంట్ వైఖరి ఎలా ఉందంటే;

ఎవరు ఏదైనా రాయనీయండి               అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
నిజమే రాశారు అనుకోండి                  అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
పిల్లల్లో సృజనాత్మకత పోతుంది            అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
మానసిక ఒత్తిడి పెరుగుతుంది             అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది              అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం
ఆత్మహత్యలు చేసుకుంటారు               అయితే నాకేంటి?         నాకు డబ్బే ప్రధానం

స్వార్థం అవధులు దాటి ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు.