Monday, April 1, 2019

ప్రేమించండి, కాని......



Designed by - Freepik.com

'ప్రేమించడం' అనేది మనిషి పుట్టుకతోనే మొదలయ్యింది. చాలా జంతువులల్లో కూడా ఈ లక్షణం గమనించవచ్చు. ప్రేమ సహజ మానసిక స్పందన. మానవత్వం ఉన్నవారికి సహజగుణం. అలాంటి సర్వ సాధారణంగా ఉండాల్సిన ప్రేమ గురించి ఏదో వింత విషయం మాట్లాడుకుంటున్నట్లు యువతలో ఆందోళన, అలజడి.

ఈ జీవితం నాది, నా భవిష్యత్తు బాగుండాలి అనుకొనే వారికి ప్రస్తుత బాధ్యతలేతప్ప మిగిలిన విషయాలు పట్టవు. ఒకవేళ, మనసు అసంకల్పితంగా ఎవరినైన ఇష్టపడితే చెయ్యవలసిన పనులు సక్రమంగా చేసుకుంటూనే ప్రేమని కొనసాగిస్తారు. ప్రేమంటే అదేదో కొత్త డిగ్రీ చదువుతున్నట్లు, చదవాల్సిన చదువుని, చెయ్యాల్సిన పనులను ప్రక్కన పెట్టరు.

ఇదో ప్రేమ కథ. చదివి మీ ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి.

డింప, వెభ్‌ బి.టెక్‌. రెండవ సంవత్సరం చదువుతున్నారు. వెభ్‌, డింపకు ప్రపోజ్‌ చేసాడు. రెండు రోజులు గడిచినా డింప ఏమీ చెప్పక పొయ్యేసరికి వెభ్‌ అసహనంగా ఉన్నాడు.

వెభ్‌         : ఎన్ని రోజులు కావాలి?

డింప : దేన్ని గురించి మాట్లాడుతున్నావ్‌. 

వెభ్‌ó్‌ : (కోపంగా) తెలియదా? 

డింప : కూల్‌ సరోజ! నిన్ననే కాలేజీకి రాగానే నీకు ఓకె అని చెబుదామనుకున్నాను.

వెభ్‌ó్‌ : మరెందుకు చెప్పలేదు?

డింప : ముందు నువ్వు ఆవేశం తగ్గించుకొని పూర్తిగా విను.

వెభ్‌      : సారీ, చెప్పు?

డింప : నిన్న కాలేజీకి రాగానే ప్రేమగురించి ఒక సైకాలజిస్టు, క్లాసు తీసుకున్నారు. 
                         ఆయన చెప్పినది విన్న తరువాత నేను ఆలోచనలోపడ్డాను.

వెభ్‌ó్‌ : ఏం చెప్పాడు? ఆయన నిన్ననే రావాలా? నువ్వు ఓకే చెప్పాక రావచ్చుగా?

డింప : కూల్‌ సరోజ!

వెభ్‌ó్‌ : (నీరసంగా) సరే, ఏంచెప్పాడు.

డింప : మూడు ప్రశ్నలు వేసారు.

వెభ్‌ó్‌ : ఏంటవి?

డింప : మొదటిప్రశ్న 'లవ్‌ ఎప్పుడు'?

వెభ్‌  : పిచ్చి ప్రశ్న, సినిమాల్లో చూడటంలా, తూనీగా తూనీగా, ఎన్ని ఎన్నని చెప్పమంటావ్‌, 
                         ప్రేమ గుడ్డిది. ఎప్పుడైనా మొదలు కావచ్చు.

డింప : అవును, ఆయన కూడ అదే చెప్పాడు.

వెభ్‌  : చూశావా! నాకు చాలా తెలుసు.

డింప : అవును, ప్రేమ గుడ్డిదయితే ప్రేమికుల జీవితం కూడా గుడ్డిదవుతుందంట.

వెభ్‌  : అలా చెప్పాడా! వెరైటీగా ఉందే.

డింప : నాకొక సందేహం ఉంది.

వెభ్‌  : ఏంటది చెప్పు.

డింప : మీ ఇంట్లో వప్పుకొనకపోతే ఏం చేస్తావ్‌?

వెభ్‌  : సింపుల్‌, లేచిపోదాం.

డింప : నేను రాను.

వెభ్‌  : ఏం, నమ్మకం లేదా?

డింప : నమ్మకం గురించి కాదు, పుట్టినప్పటినుండి నా తల్లిదండ్రులు, నన్ను  ఎంతో 
                         ప్రేమగా పెంచారు. వాళ్ళ  కష్టాలు దాచుకొని, నా ఇష్టాలనే వాళ్ళ ఇష్టాలుగా 
                          చేసుకున్నారు. వాళ్ళను వదిలి వస్తే నేను మనిషిని అవుతానా?

వెభ్‌  : నా తల్లిదండ్రులు కూడా నన్ను  అలాగే పెంచారు.

డింప : మరి మన స్వార్థం కోసం 20 సం||లు పెంచిన తల్లిదండ్రులను వదిలి  
                         వెళదాం అంటున్నావ్‌, ముందు ముందు, నీకిష్టమైనవిషయంకోసం నన్ను 
                         కూడా అలాగే వదిలి పోతావుగా?

వెభ్‌  : ఛ ! ఛ! అలా ఎందుకు చేస్తాను, సరే రెండవ ప్రశ్న చెప్పు?  

డింప : 'లవ్‌ ఎందుకు?'

వెభ్‌  : ఎందుకేంటి నా బొంద. అసలు ఆయన సైకాలజిస్ట్‌ అవునో కాదో? తిక్క తిక్క
                          ప్రశ్నలు వేసాడు.

డింప : సమాధానం చెప్పు.

వెభ్‌  : తెలియదు, నువ్వే చెప్పు.

డింప : మంచి భార్య లేదా భర్త కోసం.

వెభ్‌  : నిజమే ! ఇంకా?

డింప : అందుకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.

వెభ్‌  : మనలాగా?

డింప : నా గురించి ఏం అర్థం చేసుకున్నావో చెప్పు?

వెభ్‌  : నీకు ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టం, ఆపకుండా అయిదు అయినా తింటావు, కూల్‌డ్రింక్‌ 
                         నాకంటే స్పీడ్‌గా తాగుతావు. ఇంకేం అర్థం చేసుకోవాలి?

డింప : ఇవి బ్రతకడానికి చాలవు.

వెభ్‌  : ఇంకా ఏమున్నాయి?

డింప : మన ఎమోషన్స్‌ (భావోద్వేగాలు).

వెభ్‌  : అవేంటి !?

డింప : మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించే ఎమోషన్స్‌.  కోపం, ఏడుపు, మొండితనంలాంటి  
                          నెగిటివ్‌ ఎమోషన్స్‌, మంచితనం, ఓర్పు లాంటి పాజిటివ్‌ ఎమోషన్స్‌.

వెభ్‌  : వాటిని ఎందుకు అర్థం చేసుకోవాలి?

డింప : ఉదాహరణకి నీకు నాకు ఇద్దరికీ కోపం ఎక్కువ అనుకో. మనం పెండ్లిచేసుకుంటే, 
                         రూపాయి ఖర్చులేకుండా ప్రతి రోజూ దీపావళే.  కలసి జీవించడం కష్టం. 
                         మన ఆరోగ్యాలు పాడవుతాయి. పుట్టే పిల్లలు అశాంతి మధ్య పెరిగి దేనికీ పనికి 
                         రాకుండా పోతారు.

వెభ్‌  : ఇంత ఉందా?!

డింప : కాబట్టి ప్రేమించుకోవడం అంటే కేవలం కలసి తినడం, త్రాగడం, సినిమాలకు 
                        తిరగడం, ముద్దులు పెట్టుకోవడం కాదు, భవిష్యత్తులో ఎంతవరకు సర్దుకుపోగలమో
                        అర్థం చేసుకోవడం.

వెభ్‌  : ఆయనెవరో భలే చెప్పాడు.

డింప : ఇక మూడవ ప్రశ్న, 'ఎలా ప్రేమించాలి?'

వెభ్‌  : ప్రేమించడానికి కూడా ఓ పద్ధతి ఉందా?

డింప : అవును, నిస్వార్థంగా ప్రేమించాలి. అంటే తల్లి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుంది, 
                            బిడ్డ కుంటిదైనా, గ్రుడ్డిదైనా తల్లి తన గుండెలకు హత్తుకుంటుంది. తన జీవితం 
                            త్యాగం చేస్తుంది. అలాంటి భావన నీకు నాకు మధ్య ఉంటే జీవితాంతం కలసి 
                            ఉంటాం. విడదీసేది ఒక్క చావు మాత్రమే.

వెభ్‌  : అద్భుతం. విన్న విషయాలన్నీ పాటించడానికి ప్రయత్నిస్తా. ఒక ముద్దు ప్లీజ్‌.

డింప : కూల్‌ సరోజ, కూల్‌.


                     '' ఈ రోజుల్లో యువత ఒకరినొకరు సరిగా అర్ధం చేసుకోకుండా

                      ప్రేమలో పడుతున్నారు, అర్ధం చేసుకోగానే విడిపోతున్నారు ''


ప్రేమను కలిగించే రసాయనాలు
  • మనిషిలో వయసుతో పాటు కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అవి లోపల తన్నితే మనం బయట 'ఐలవ్‌ యూ' అంటూ ఉంటాం.
  • ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడటానికి డోపమిన్‌, నోరెపైన్‌ఫ్రైన్‌, సెరటోనిన్‌  రసాయనాలు కారణమవుతాయి.
  • ఆక్సిటోసిన్‌, వాసోప్రెసిన్‌ అనే రసాయనాలు ఉత్పత్తి అయితే, అలాంటి వారు కలకాలం కలసి మెలసి ఉంటారు.
  • టెస్టెస్టోరాన్‌ ఎక్కువ ఉత్పత్తి అయితే వీరు సెక్స్‌ కోరుకుంటారు. 
* ప్రేమతో చెలగాటం నిప్పుతో చెలగాటమే*

మరిన్ని వివరాలు "వారిని బ్రతకనిద్దాం" శీర్షిక క్రింద త్యరలో తెలుసుకుందాం.

References
Emanuele E, Politi P, Bianchi M, Minoretti P, Bertona M, Geroldi D (2006). “Raised plasma nerve growth factor levels associated with early-stage romantic love”. Psychoneuroendocrinology Vol. 31(3), PP.288–94. doi:10.1016/j.psyneuen.2005.09.002. PMID 16289361.
S. Zeki in FEBS Lett. (2007), The neurobiology of love”, Vol. 581, PP. 2575-2579. PMID 17531984.

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్

Source: behappy.org.in