Source: behappy.org.in

యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టింది. దీని అర్ధం శరీర అవయవాలన్నింటిని ఒకటిగా చేసుకోవడం. ఒక గులాబి పువ్వులోని రేకులు అన్ని కలసి పువ్వురూపం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదే పువ్వు రేకులను విడదీసి ఓ పుల్లకు దారంతో కట్టామనుకోండి. అందులో అందం ఉండదు. జీవం ఉండదు. అదే విధంగా శరీర భాగాలన్నీ విడివిడిగా దేనికదే ప్రవర్తిస్తే జీవితం అయోమయంగా ఉంటుంది. అన్ని అవయవాలు క్రమపద్ధతిలో మనసుతో ఒకటిగా వర్తిస్తే ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకు యోగా తోడ్పడుతుంది.
ఈ ప్రక్రియను మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఋషులు యోగాను రూపొం దించి ఆచరించారు. యోగా విశిష్టతను గుర్తించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నడుం బిగించింది. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు జూన్ నెల 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఈ సంవత్సరం పాటించాయి.
యోగావల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంకా
·
శరీరం బరువు తగ్గుతుంది.
·
మానసిక వత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
·
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
·
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
·
మనసు సమతాస్థితిలో ఉంటుంది.
కాబట్టి అందరూ యోగాను సాధన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
*యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా జీవించండి*
No comments:
New comments are not allowed.