Source: behappy.org.in
మన దేశంలోని విద్యా సంస్థల్లో ప్రత్యేకించి ఇంజనీరింగ్, మెడికల్, వ్యవసాయ తదితర వృత్తి విద్యా కళాశాలల్లో జూనియర్లకు తరగతులు మొదలవుతున్నాయంటే అందరికి గుర్తుకొచ్చే పదం 'ర్యాగింగ్'. ర్యాగింగ్‌ను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి హేజింగ్, బుల్లియింగ్, ప్లెడ్జింగ్, ఫాగింగ్ హార్స్ ప్లేయింగ్.
ర్యాగింగ్ - అర్ధాలు:
ర్యాగింగ్ అంటే తెలుగులో 'అల్లరి' అని అర్థం. దీన్ని 'హద్డులతో కూడిన అల్లరి' అని అర్థం చేసుకోవాలి. దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెబుతున్నారు.
కొందరి దృష్టిలో ఇది సీనియర్ల ముందు పాటలు పాడటం, డాన్స్ చేయడం.
ఇంకొందరి దృష్టిలో సీనియర్ల హోంవర్కు చేయడం, నిత్య జీవితంలో కొన్ని పనులు చేసిపెట్టడం.
మరికొందరి దృష్టిలో మాటలతోను, చేతలతోను, భౌతికంగా, మానసికంగా, శృంగారపరంగా హింసించడం.
మొదటి దానివరకు ముద్దు. రెెండు, మూడు వద్దు. ముద్దుగా మొదలైన ర్యాగింగ్ హద్దులు దాటి నేడు వికృతంగా మారింది. అందుకే సుప్రీంకోర్టు దీన్ని నిషేధించింది.
ర్యాగింగ్ మానండి, స్నేహం చెయ్యండి
ర్యాగింగ్ ఉద్దేశ్యం జూనియర్లలో భయంపోగొట్టి, వారితో స్నేహం చేయడమే అయితే అందుకు ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి జూనియర్ విద్యార్ధుల సమస్యల పట్ల అవగాహన కలిగివుండడం.
జూనియర్ విద్యార్ధుల సమస్యలు
ఇలాంటి వారితో సీనియర్ విద్యార్ధులు ఎలా వుండాలి? సహాయం చేయకపోయినా పరవాలేదు కాని, ర్యాగింగ్ పేరుతో వారిని హింసించడం అమానుషం. ఒకవేళ ఏ సమస్య లేకుండా హాయిగా వున్నారనుకోండి, ర్యాగింగ్ పేరుతో మీరే క్రొత్త సమస్య కావడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
పైన పేర్కొన్న సమస్యల పట్ల అవగాహన వుంటే మీరు ర్యాగర్స్‌గా మారరు, సేహితులుగా వుంటారు.
జూనియర్లకు కావల్సింది:
ర్యాగింగ్ నిర్మూలనకు కృషిచేస్తున్న సంస్థలు :
మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ర్యాగింగ్ నిర్మూలనకు ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి:
1. సేవ్ : ఇది దేశంలో మొట్టమొదటి రిజిస్టర్ అయిన సంస్థ.
2. క్యూర్ : ఈ సంస్థ 2001లో ర్యాగింగ్ నిర్మూలనకు, సీనియరు - జూనియర్ విద్యార్ధుల
మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి స్థాపించబడింది.
ర్యాగింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ సంస్థల యొక్క వెబ్‌సైట్స్ చూడండి.
ర్యాగింగ్ పరిధిలోకి వచ్చే అంశాలు :
I. మాటలతో, వ్రాతలతో బాధించడం :
వ్యక్తిగతమైన ప్రశ్నలకు సమాధానం చెప్పమని వత్తిడి చెయ్యడం, సమాజపరంగా అంగీకారం కాని ప్రశ్నలు అడగడం, మాటలతో ఇబ్బంది పెట్టడం, అవమానించడం, హింసించడం, బాధ కలిగించే వ్రాతలు వ్రాయడం.
II. భౌతికంగా ఇబ్బంది పెట్టడం :
III. మానసికంగా బాధించడం:
IV. శృంగారపరమైనవి :
ర్యాగర్ల మనస్తత్వం ఎలా వుంటుంది?
ర్యాగింగ్ చేసేవారిలో కొందరు, గుంపులో అందరితోపాటు చెయ్యాలని చేస్తారు. విడిగా వీరు మంచి మనస్తత్వం కలిగివుంటారు. కాని ర్యాగింగ్ తప్పకుండా చెయ్యాలనే మనస్తత్వం వున్నవారు రకరకాల చెడు లక్షణాలు కలిగివుంటారు.
ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ వ్యతిరేక చట్టం (1997 ప్రకారం) ర్యాగింగ్ చేయువారికి / ర్యాగింగ్ ప్రోత్సహించు వారికి విధింపబడు శిక్షలు (సెక్షన్ 4 ప్రకారం)
1. పైన పేర్కొనబడిన శిక్షలే కాకుండా, విద్యాలయం నుండి తాత్కాలికంగా / శాశ్వతంగా తొలగించుట, ఇకపై ఏ విద్యాలయం లోను ప్రవేశంలేకుండా వేటు.
2. పైన చెప్పబడిన శిక్షలలో ఏ ఒక్క శిక్షను అనుభవించినా ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి శాశ్వతంగా అనర్హుడు. ఏ దేశానికి వెళ్ళాలన్నా పాస్‌పోర్ట్ జారీ చేయబడదు.
జూన్ 2009లో యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ ర్యాగింగ్ చేసిన వారికి విధించవలసిన శిక్షల గురించి మరింత వివరంగా తెలియజేసింది. ర్యాగింగ్ స్థాయినిబట్టి వీటిలో ఒకటి లేదా ఎక్కువ శిక్షలు విధించవచ్చు.
యాజమాన్యం ర్యాగింగ్‌ను చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. యాజమాన్యం చొరవే ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం. ఏముందిలే అని తేలిగ్గా తీసుకుంటే ఒక్క సంఘటన చాలు, కాలేజీ పేరును పూర్తిగా చెడగొట్టడానికి. అందుకని యాజమాన్యం లేదా అధికారులు డా. రాఘవన్ కమిటి సూచించిన విధంగా ప్రతి కళాశాలలో ర్యాగింగ్ సల్‌లను వెంటనే ఏర్పాటు చెయ్యాలి. ఈ సెల్ ఆధ్వర్యంలో క్రింది విషయాలు అమలుచేయాలి.
వ్యక్తిత్వ అభివృద్ధి సెల్ ఏర్పాటు
వ్యక్తిత్వం అంటే చాలామంది మన అందానికి సంబంధించినది అనుకొంటారు. కాని అసలు అర్థం మన ఆలోచనలు ప్రవర్తన, భావావేశాలు మొదలైనవన్నీ కలిసినది. చదువుకూడా వ్యక్తిత్వంలోని భాగమేనని తెలుసుకోవాలి.
నేటి చదువులు సబ్జెక్ట్ విషయాలు నేర్పుతున్నాయేకాని ఎలా జీవించాలో నేర్పడంలేదు. ఎంత చదివినా, ఎంత ఆస్తివున్నా జీవించడం తెలియకపోతే జీవితం వృధా. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రలు జీవించడం ఎలా అంటే చెప్పలేని స్థితిలో వున్నారు. కొందరు చెప్పినా గలిగినా వినే స్థితిలో పిల్లలు లేరు. జీవించే విధానం తెలిసివుంటే ఏ విద్యార్ధి, విద్యార్ధినీ కూడా ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడరు. ఈ విధానం నేర్పడమే 'వ్యక్తిత్వ అభివృద్ధి సెల్' లక్ష్యం. ఈ సెల్ విద్యార్ధుల్లో ఆత్మస్ధైర్యం పెంచడమేకాక వారు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
విద్యార్ధులు కళాశాలలో చేరిన మొదటి వారంలోనే ప్రశ్నావళి ఉపయోగించి వారి వ్యక్తిత్వాన్ని అధ్యయనం చెయ్యాలి. వారిచ్చే సమాధానాల ఆధారంగా విద్యార్ధుల్లో గ్రూపులను గుర్తించాలి. ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. ముందుగా గ్రూపు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని, వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని గుర్తించాలి. వ్యక్తిగత కౌన్సిలింగ్ ద్వారా వ్యక్తిగత సమస్యలను, గ్రూపు కౌన్సిలింగ్ ద్వారా ఎక్కువమందికి వుండే ఒకే రకమైన సమస్యకు పరిష్కారం చూపవచ్చు.
ఉపాధ్యాయుల పాత్ర :
విద్యార్ధులు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల సమక్షంలోనే గడుపుతారు. వారికి గౌరవమిస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్ధులకు ప్రతిరోజూ కొద్దిసెేపైనా జీవననైపుణ్యాలను ప్రస్తావించాలి. విద్యార్ధులు విద్యకు సంబంధించిన విషయాలలో స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చే వాతావరణాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి. సీనియర్ విద్యార్ధుల సహాయం లేకపోతే చదువులో తాము నష్టపోతామన్న అభిప్రాయాన్ని టీచర్లే తొలగించాలి. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చిన వారికి ర్యాగింగ్ పై అవగాహన కలిగించాలి.
మీడియాపాత్ర :
నేడు మీడియా ప్రజా అవసరాలలో ఒక భాగమైపోయింది. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను సెకనులలో ప్రజలకు తెలియజేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంలో మీడియా వల్ల కొన్ని ఉపయోగాలు మరికొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి.
ఉపయోగాలు :
ర్యాగింగ్‌కు సంబంధించిన చట్టాలు, పడే శిక్షలు, బాధితులకు జరిగే నష్టం తదితర విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.
మంచిగా జీవించాలనుకొనే కుటుంబాలు పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇస్తాయి. ర్యాగింగ్‌లో మాటలతో హింసించారనో, గాయాలయ్యేలా కొట్టారనో వ్రాస్తే బాధితులకు నష్టంలేదు. కాని శృంగారపరమైన దాడులు లాంటివి జరిగినప్పుడు వాటిని బహిరంగ పరచడం విద్యార్ధికీి, వారి కుటుంబ సభ్యులకు పరువుపోయినట్లే.
సినిమాలలో ర్యాగింగ్‌ను చాలా సరదా విషయంలా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నిషేధించినా జుగుప్సాకరమైన, వెకిలి చేష్టలు, రోత, వెగటు పుట్టించే డైలాగులు వ్రాయడం, నటించడం - దానికో దర్శకత్వం. వారి విజ్ఞతకే వదలివేయడం మంచిది.
మరిన్ని వివరాలకు యు.జి.సి జూన్, 2009లో రూపొందించిన రెగ్యులేషన్స్ చదవండి.
సంబధిత వెబ్ సైట్లు
http://en.wikipedia.org/wiki/Ragging
http://en.wikipedia.org/wiki/Ragging_in_India
http://www.ugc.ac.in/page/Ragging-Related-Circulars.aspx

- మొదటిసారి హాస్టల్ వాతావరణంలోకి రావడం
- ఇంటిపై బెంగ
- డబ్బులు దుబారా చేసే అలవాటు
- ప్రతి చిన్నదానికీ భయపడటం
- చదువు సరిగా రాకపోవడం
- పరీక్షలంటే భయం
- ప్రతి విషయాన్ని అనుమానించడం
- ఆర్ధిక ఇబ్బందులు
- తన చదువుపైనే కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉండటం
- చీటికి మాటికీ ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం
- అనారోగ్యం
- అవిటితనం
- అందంగా లేకపోవడం
- ప్రేమ బాధలు
- తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరిని కోల్పోవడం
ఇలాంటి వారితో సీనియర్ విద్యార్ధులు ఎలా వుండాలి? సహాయం చేయకపోయినా పరవాలేదు కాని, ర్యాగింగ్ పేరుతో వారిని హింసించడం అమానుషం. ఒకవేళ ఏ సమస్య లేకుండా హాయిగా వున్నారనుకోండి, ర్యాగింగ్ పేరుతో మీరే క్రొత్త సమస్య కావడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.
పైన పేర్కొన్న సమస్యల పట్ల అవగాహన వుంటే మీరు ర్యాగర్స్‌గా మారరు, సేహితులుగా వుంటారు.
జూనియర్లకు కావల్సింది:
- కొత్తగా వచ్చిన జూనియర్లకు, వారిలో వుండే భయాలను పోగొట్టి కాంపస్ వాతావరణం అలవాటు చేయడం.
- చదువుకు సంబంధించి అనుమానాలుంటే తీర్చి కార్యోన్ముఖులను చేయడం.
- భవిష్యత్ పట్ల సరియైన అవగాహన కల్పించి సరియైన మార్గం వైపు నడిపించడం.
- ఇంటి బెంగతో, వంటరితనంతో బాధపడేవారికి మీ అన్నలుగా, అక్కలుగా మేమున్నామని ఆప్యాయతానురాగాలను పంచడం.
- కుల సంఘాలకు, మూఢ నమ్మకాలకు దూరంగావుంచడం.
ర్యాగింగ్ నిర్మూలనకు కృషిచేస్తున్న సంస్థలు :
మన దేశంలోని వివిధ ప్రాంతాలలో ర్యాగింగ్ నిర్మూలనకు ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి:
1. సేవ్ : ఇది దేశంలో మొట్టమొదటి రిజిస్టర్ అయిన సంస్థ.
2. క్యూర్ : ఈ సంస్థ 2001లో ర్యాగింగ్ నిర్మూలనకు, సీనియరు - జూనియర్ విద్యార్ధుల
మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి స్థాపించబడింది.
ర్యాగింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ సంస్థల యొక్క వెబ్‌సైట్స్ చూడండి.
ర్యాగింగ్ పరిధిలోకి వచ్చే అంశాలు :
I. మాటలతో, వ్రాతలతో బాధించడం :
వ్యక్తిగతమైన ప్రశ్నలకు సమాధానం చెప్పమని వత్తిడి చెయ్యడం, సమాజపరంగా అంగీకారం కాని ప్రశ్నలు అడగడం, మాటలతో ఇబ్బంది పెట్టడం, అవమానించడం, హింసించడం, బాధ కలిగించే వ్రాతలు వ్రాయడం.
II. భౌతికంగా ఇబ్బంది పెట్టడం :
- విద్యావిషయాలకు అంతరాయం లేదా ఆందోళన కలిగించడం
- వస్తువులతో కొట్టడం
- తనను తాను కొట్టుకొమ్మనడం
- గాయాలయ్యేదాకా కొట్టడం
- ఎదుటివారిని కొట్టమనడం
- ఆరోగ్యం పాడయ్యే పనులు చేయించడం
- ఎదుటివారి పాదాలు పట్టుకోమనడం
- వివిధ భంగిమలలో కూర్చోమనడం
- ఒంటికాలిపై నిలబెట్టడం
- గదులు ఊడ్పించడం
- తమ హోంవర్క్, రికార్డులు వ్రాయించడం
- గంటల తరబడి కాలహరణం చేయడం
- ఇష్టంలేని బట్టలు ధరించి రమ్మనడం
- మనుషులు త్రాగనివి త్రాగమనడం
- డ్రగ్స్ తీసుకొమ్మని బలవంతం చేయడం
- డబ్బు తీసుకోవడం
- తంతి-తపాల, ఇ-మెయిల్ సెల్ ఫోన్ ద్వారా వేధించడం
- వస్తువులు, సెల్ ఫోన్లు వగైరా తీసుకుని రోజుల తరబడి వాడుకోవడం
- కుల సంఘాలలో సభ్యులుగా చేరమని వేధించడం
III. మానసికంగా బాధించడం:
- మానసికంగా వత్తిడికలిగించడం.
- సిగ్గుమాలిన పనులు చేయించడం.
- మానసిక ఆరోగ్యాన్ని పాడుచేయడం.
- మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీయడం.
- శాడిస్టిక్, పర్వర్టెడ్ ఆనందాన్ని పొందడం.
IV. శృంగారపరమైనవి :
- బట్టలు తీసివేయమనడం
- అసభ్యకరమైన ఫోటోలు తీయడం
- మర్మావయములు పట్టుకోమనడం
ర్యాగర్ల మనస్తత్వం ఎలా వుంటుంది?
ర్యాగింగ్ చేసేవారిలో కొందరు, గుంపులో అందరితోపాటు చెయ్యాలని చేస్తారు. విడిగా వీరు మంచి మనస్తత్వం కలిగివుంటారు. కాని ర్యాగింగ్ తప్పకుండా చెయ్యాలనే మనస్తత్వం వున్నవారు రకరకాల చెడు లక్షణాలు కలిగివుంటారు.
- శారీరకంగా బాధపెట్టి ఆనందించేవారు
- అసభ్యంగా తిట్టి ఆనందించేవారు
- ఎదుటివారి మనసును గాయపరచి సంతోషించేవారు
- స్వలింగ సంపర్కంతో సంతృప్తి పొందేవారు
- శృంగార పదాలను వాడి సంతృప్తి పొందేవారు
- దురలవాట్లకు తేలిగ్గా ఆకర్షింపబడేవారు
- జీవితాన్ని వ్యాపార దృష్టితో చూసేవారు
- తనకే అన్నీ తెలుసు, తనదే అంతా రైటు అనుకొనేవారు
- పెద్దలపట్ల, నీతి నియమాల పట్ల గౌరవంలేనివారు
- స్వార్ధపరులు
ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ వ్యతిరేక చట్టం (1997 ప్రకారం) ర్యాగింగ్ చేయువారికి / ర్యాగింగ్ ప్రోత్సహించు వారికి విధింపబడు శిక్షలు (సెక్షన్ 4 ప్రకారం)
1. పైన పేర్కొనబడిన శిక్షలే కాకుండా, విద్యాలయం నుండి తాత్కాలికంగా / శాశ్వతంగా తొలగించుట, ఇకపై ఏ విద్యాలయం లోను ప్రవేశంలేకుండా వేటు.
2. పైన చెప్పబడిన శిక్షలలో ఏ ఒక్క శిక్షను అనుభవించినా ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి శాశ్వతంగా అనర్హుడు. ఏ దేశానికి వెళ్ళాలన్నా పాస్‌పోర్ట్ జారీ చేయబడదు.
జూన్ 2009లో యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ ర్యాగింగ్ చేసిన వారికి విధించవలసిన శిక్షల గురించి మరింత వివరంగా తెలియజేసింది. ర్యాగింగ్ స్థాయినిబట్టి వీటిలో ఒకటి లేదా ఎక్కువ శిక్షలు విధించవచ్చు.
- తరగతి గదిలోకి రాకుండా సస్పెండ్ చెయ్యడం, విద్యాపరమైన సహాయం నిలిపి వేయడం.
- స్కాలర్‌షిప్ ఇతర బెనిఫిట్స్ పూర్తిగా లేదా తాత్కాలికంగా నిలిపివేయడం.
- పరీక్షలలో / ఇతర పోటీ పరీక్షలలో పాల్గొనకుండా నిషేధించడం.
- పరీక్షా ఫలితాలను నిలిపివేయడం.
- విద్యా సంస్థ తరపున ఎలాంటి పోటీలలోను పాల్గొనకుండా నిషేధం.
- హాస్టలు నుండి సస్పెండ్ చేయడం / బహిష్కరించడం.
- అడ్మిషన్ రద్దు చేయడం.
- ఒకటి నుండి అన్నీ లేదా చివరి సెమిష్టర్ వరకు సంస్థ చాయలకు రాకుండా బహిష్కరించడం.
- సంస్థ నుండి బహిష్కరణ / మరే ఇతర సంస్థలలోను చేరకుండా కొంతకాలం నిషేధం.
- రు. 2.5 లక్షల వరకు జరిమానా.
యాజమాన్యం ర్యాగింగ్‌ను చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. యాజమాన్యం చొరవే ఈ సమస్యకు ప్రధాన పరిష్కారం. ఏముందిలే అని తేలిగ్గా తీసుకుంటే ఒక్క సంఘటన చాలు, కాలేజీ పేరును పూర్తిగా చెడగొట్టడానికి. అందుకని యాజమాన్యం లేదా అధికారులు డా. రాఘవన్ కమిటి సూచించిన విధంగా ప్రతి కళాశాలలో ర్యాగింగ్ సల్‌లను వెంటనే ఏర్పాటు చెయ్యాలి. ఈ సెల్ ఆధ్వర్యంలో క్రింది విషయాలు అమలుచేయాలి.
- సీనియర్ల ఆధ్వర్యంలో జూనియర్ల అభివృద్ధి కమిటీల ఏర్పాటు
- జూనియర్లు, సీనియర్లు కలవకుండా కళాశాల వేళల్లో మార్పు చేయడం లేదా వేర్వేరు బ్లాకులలో కూర్చోబెట్టడం
- జూనియర్లు భవిష్యత్తులో ర్యాగింగ్ చేయకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు.
- టీచర్ల పర్యవేక్షణలో విద్యార్ధులు వుండేలా చేయడం.
- జూనియర్- సీనియర్ సమావేశాలు నిర్వహించడం.
- వ్యక్తిత్వ అభివృద్ధి సెల్ ద్వారా మంచి జీవన విధానం నేర్పడం. వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం చూపడం.
- Display boards ద్వారా ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు, శిక్షలు తెలియజేయడం.
- Fresher's day వీలయినంత త్వరగా జరపడం
- .తల్లిదండ్రులతో కనీసం సంవత్సరానికి రెండుసార్లు సమావేశాలు నిర్వహించడం.
- విద్యార్ధులు ఖాళీగా ఉండకుండా చదువుతోపాటు కొన్ని పాఠ్యేతర విషయాలలో నైపుణ్యం సాధించేలా ప్రోత్సహించడం (ఆటలు, లలిత కళలు, భాషా ప్రావీణ్యం, క్విజ్, డిబేట్ ఇతర భాషలలో సర్టిఫికెట్ కోర్సులు మొదలైనవి).
వ్యక్తిత్వ అభివృద్ధి సెల్ ఏర్పాటు
వ్యక్తిత్వం అంటే చాలామంది మన అందానికి సంబంధించినది అనుకొంటారు. కాని అసలు అర్థం మన ఆలోచనలు ప్రవర్తన, భావావేశాలు మొదలైనవన్నీ కలిసినది. చదువుకూడా వ్యక్తిత్వంలోని భాగమేనని తెలుసుకోవాలి.
నేటి చదువులు సబ్జెక్ట్ విషయాలు నేర్పుతున్నాయేకాని ఎలా జీవించాలో నేర్పడంలేదు. ఎంత చదివినా, ఎంత ఆస్తివున్నా జీవించడం తెలియకపోతే జీవితం వృధా. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రలు జీవించడం ఎలా అంటే చెప్పలేని స్థితిలో వున్నారు. కొందరు చెప్పినా గలిగినా వినే స్థితిలో పిల్లలు లేరు. జీవించే విధానం తెలిసివుంటే ఏ విద్యార్ధి, విద్యార్ధినీ కూడా ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడరు. ఈ విధానం నేర్పడమే 'వ్యక్తిత్వ అభివృద్ధి సెల్' లక్ష్యం. ఈ సెల్ విద్యార్ధుల్లో ఆత్మస్ధైర్యం పెంచడమేకాక వారు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది.
విద్యార్ధులు కళాశాలలో చేరిన మొదటి వారంలోనే ప్రశ్నావళి ఉపయోగించి వారి వ్యక్తిత్వాన్ని అధ్యయనం చెయ్యాలి. వారిచ్చే సమాధానాల ఆధారంగా విద్యార్ధుల్లో గ్రూపులను గుర్తించాలి. ఒకరికి ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. ముందుగా గ్రూపు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని, వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని గుర్తించాలి. వ్యక్తిగత కౌన్సిలింగ్ ద్వారా వ్యక్తిగత సమస్యలను, గ్రూపు కౌన్సిలింగ్ ద్వారా ఎక్కువమందికి వుండే ఒకే రకమైన సమస్యకు పరిష్కారం చూపవచ్చు.
ఉపాధ్యాయుల పాత్ర :
విద్యార్ధులు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల సమక్షంలోనే గడుపుతారు. వారికి గౌరవమిస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్ధులకు ప్రతిరోజూ కొద్దిసెేపైనా జీవననైపుణ్యాలను ప్రస్తావించాలి. విద్యార్ధులు విద్యకు సంబంధించిన విషయాలలో స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చే వాతావరణాన్ని ఉపాధ్యాయులు పెంపొందించాలి. సీనియర్ విద్యార్ధుల సహాయం లేకపోతే చదువులో తాము నష్టపోతామన్న అభిప్రాయాన్ని టీచర్లే తొలగించాలి. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోనికి వచ్చిన వారికి ర్యాగింగ్ పై అవగాహన కలిగించాలి.
మీడియాపాత్ర :
నేడు మీడియా ప్రజా అవసరాలలో ఒక భాగమైపోయింది. ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాలను సెకనులలో ప్రజలకు తెలియజేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంలో మీడియా వల్ల కొన్ని ఉపయోగాలు మరికొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి.
ఉపయోగాలు :
ర్యాగింగ్‌కు సంబంధించిన చట్టాలు, పడే శిక్షలు, బాధితులకు జరిగే నష్టం తదితర విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి.
- ర్యాగింగ్ జరిగితే వెంటనే బయట పెడుతున్నాయి.
- కేసులు నమోదు అవడంలోను, బాధితులకు న్యాయం జరిగేలా చూడడంలోను తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.
మంచిగా జీవించాలనుకొనే కుటుంబాలు పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇస్తాయి. ర్యాగింగ్‌లో మాటలతో హింసించారనో, గాయాలయ్యేలా కొట్టారనో వ్రాస్తే బాధితులకు నష్టంలేదు. కాని శృంగారపరమైన దాడులు లాంటివి జరిగినప్పుడు వాటిని బహిరంగ పరచడం విద్యార్ధికీి, వారి కుటుంబ సభ్యులకు పరువుపోయినట్లే.
సినిమాలలో ర్యాగింగ్‌ను చాలా సరదా విషయంలా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు ర్యాగింగ్‌ను నిషేధించినా జుగుప్సాకరమైన, వెకిలి చేష్టలు, రోత, వెగటు పుట్టించే డైలాగులు వ్రాయడం, నటించడం - దానికో దర్శకత్వం. వారి విజ్ఞతకే వదలివేయడం మంచిది.
మరిన్ని వివరాలకు యు.జి.సి జూన్, 2009లో రూపొందించిన రెగ్యులేషన్స్ చదవండి.
* ర్యాగింగ్ మానండి, స్నేహం చెయ్యండి *
సంబధిత వెబ్ సైట్లు
http://en.wikipedia.org/wiki/Ragging
http://en.wikipedia.org/wiki/Ragging_in_India
http://www.ugc.ac.in/page/Ragging-Related-Circulars.aspx
No comments:
New comments are not allowed.