భార్య/భర్త లేకపోయిన బ్రతకొచ్చు, కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేం బాబు!

సెల్ ఫోన్ తో ఎక్కువ గడపటానికి ఇష్టపడటానికి కారణం మనిషి ఆలోచనా విధానంలో చాలా మార్పు రావడమే. ఈ రోజుల్లో యువత స్వేచ్చా జీవనం కోరుకుంటున్నారు. ఎదుటి వారు తను చెప్పింది వినాలి, దాన్ని సరే అనాలి, బాగా లేదు అనకూడదు సలహాలు చెప్పకూడదు అని కోరుకుంటున్నారు. ఎదుటివారితో సర్దుకుపోయే గుణం తగ్గిపో-యింది. సెల్ ఫోన్ తో అయితే తనకు నచ్చినవి చూసుకోవచ్చు, నచ్చిన వారితో మాట్లాడుకోవచ్చు, సందేశాలు పంపుకోవచ్చు, ఇన్ని అవకాశాలు ఉన్న సెల్ ఫోన్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు.
*ఈ ఒంటరితనం అనర్ధం, అనారోగ్యం*