మనిషి భౌతిక, మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడే సంతోషంగా జీవించగలుగుతాడు. అలాంటి వ్యక్తులతో కూడిన సమాజం మాత్రమే జీవించటానికి అనువుగా ఉంటుంది. అశాంతి, అభద్రతలతో కూడిన సమాజం మానవజాతి మనుగడనే ప్రశ్నిస్తుంది. మనిషి జీవితానికి అర్థం లేకుండా పోతుంది. మనిషి చేసే పనులు, ఆలోచనలు, తద్వారా ఏర్పడే భావోద్వేగాలు, దాని ఫలితాలు శరీరంలో క్రమబద్ధంగా జరుగుతున్నాయి. ఇంద్రియాలు- కన్ను, ముక్కు, చెవి మొదలైనవి మన చుట్టూ ఉన్న పరిసరాలనుండి విషయాలను మనసుకు చేరవేస్తాయి. మనుషులు, వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి విషయం పట్ల ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. వారికి కలిగిన భావం వల్ల మెదడులో విద్యుత్ తరంగాలు ఏర్పడి, అవి ఒక భావోద్వేగాన్ని కలుగజేస్తాయి. అది పాజిటివ్ అయితే (ఉదా; ప్రేమ, దయ, మెచ్చుకోలు) వ్యక్తి ఆరోగ్యం బాగుండే న్యూరో ట్రాన్స్ మిటర్లను ఉత్పత్తి చేస్తాయి. న్యూరో ట్రాన్స్ మిటర్లనగా రసాయన వార్తాహరులు. నెగిటివ్ అయితే (ఉదా: కోపం, అసూయ, ద్వేషం) అనారోగ్యాన్ని కలిగించే న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే మంచిగా బ్రతకా ల్సిందే. ఆరోగ్యంగా వుంటేనే ప్రశాంతంగా వుంటాం. వివరాలను పటంలో చూడవచ్చును.