source:behappy.org.in
‘‘ఈ జీవిత రహస్యం తెలుసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం’’. ‘ధ్యానం’ అంటే ఏదైనా విషయంపై మనసు లగ్నం చేయడమే. మనదేశంలో ధ్యానం విశిష్టతను గుర్తించి 3000 సం॥ క్రిందటే ఆచరించారు. తరువాత నైతిక మిలువల పతనంతో, భౌతిక సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వడంతొ కొంత కాలం ప్రాధాన్యత కోల్పోయింది. మనిషి సమస్యలను పెంచుకొని అశాంతికి లోనవడంతో ఇటీవ మరలా ధ్యానానికి గుర్తింపు వచ్చింది.
ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఇతర దేశస్తులు పరిశోధ నల ద్వారా గుర్తించారు. జులై 2012లో పొస్నర్ అనే శాస్త్రవేత్త తన సహచరులతో కలసి ఒక పరిశోధనా వ్యాసం ప్రచురించారు. వీరు చైనాలో 58మంది డిగ్రీ చదివే విద్యార్ధులపై పరిశోధన చేశారు. ధ్యానం అలవాటు లేని ఈ 58 మందికి మెదడు స్కానింగ్ తీయించారు. రోజుకు 20 ని॥ చొప్పున రెండు వారాలపాటు ధ్యానం చేయించి మరలా స్కానింగ్ తీయించారు. ధ్యానం చేసిన తరువాత తీసిన స్కాన్‌లో మన ఆలోచన, జ్ఞాపకశక్తి మొదలైన ముఖ్య విషయాలను నియంత్రించే గ్రే లేయర్ నిర్మాణంలో అనుకూలమైన మార్పులను గమనించారు.
అక్టోబర్ 2012లో బౌద్ద సన్యాసిగా మారిన రికార్డ్ అనే శాస్త్రవేత్తపై రిచర్డ్‌సన్ అనే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పరిశోధన చేసాడు. రికార్డ్ గాఢమైన ధ్యానంలో ఉండగా ఆయనకు 256 రకాల సెన్సార్ లను తగిలించి ఫలితాలను విశ్లేషించాడు.
ఈ రెండు పరిశోధనలను బట్టి ధ్యానం చేసేవారిలో వివేకం, జ్ఞాపకశక్తి, టెన్షన్స్ నుండి, చెడు అవాట్లనుండి బయటపడే శక్తి పెరిగినట్లు తెలిసింది.
ఉపయోగాలు
1. శ్వాస క్రమబద్ధంగా జరుగుతుంది.
2. గుండె కొట్టుకోవడం సక్రమంగా జరుగుతుంది.
3. మనసు సమతాస్థితిలో ఉంటుంది.
4. ఏకాగ్రత పెరుగుతుంది.
5. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
6. తెలివితేటలు సరిగా పనిచేస్తాయి.
7. సృజనాత్మకత పెరుగుతుంది.
8. క్లిష్టమైనవి కూడా తేలిగ్గా అర్ధమవుతాయి.
9. నిద్ర సరిగా పడుతుంది.
10. దేహం బరువు సరిగా ఉంటుంది.
11. ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు.
12. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
13. విశ్లేషణాశక్తి పెరుగుతుంది.
14. మానసిక వత్తిడి తగ్గుతుంది.
15. చెడు అలవాట్ల నుండి బయట పడతారు.
ఇన్ని లాభాలున్న ధ్యానాన్ని ఎలా చేయాలి?

- ధ్యానం అంటే మీ శ్వాస ఎలా జరుగుతుందో గమనించడమే.
- ప్రతిరోజూ ఒకే ప్రదేశంలో కూర్చోండి.
- ప్రతిరోజూ ఒకే సమయంలో (ఉదయం లేదా సాయంత్రం) ధ్యానం చేయండి.
- కనీసం అంగుళం మందం ఉండేలా దుప్పటి లేదా మరేదైనా వేసుకొని కూర్చోవాలి.
- పొట్ట ఖాళీగా ఉండకూడదు, అలా అని బిర్రుగా ఉండకూడదు.
- మీకు వీలైన పద్ధతిలో కూర్చొండి.
- మీ వెన్నుముకను నిటారుగా ఉంచుకోండి.
- శరీరంలో ఏ భాగం పైన కూడా వత్తిడి లేకుండా చూసుకోండి.
- హడావుడి పనులేమైనా ఉంటే అవి పూర్తి చేసుకొనే కూర్చొండి.
- కళ్ళు మూసుకోండి.
- శ్వాస ఎంతనెమ్మదిగా తీసుకోగలిగితే అంత నెమ్మదిగా తీసుకోండి, అంతే నెమ్మదిగా వదండి.
- మనసు ఏదోక ఆలోచన వైపు వెళుతుంది. నెమ్మదిగా అనుభ వంతో దారిలోకి వస్తుంది. బలవంతాన మాత్రం మనసును శ్వాసపైకి తీసుకురాకండి.
- మీరు ఆలోచలను పట్టించుకొనక సాక్షిగా ఉండండి.
*ధ్యానం చెయ్యండి, జీవిత రహస్యాన్ని తెలుసుకోండి*