Source: behappy.org.in
చాలామంది విద్యార్ధులు, తోటి విద్యార్ధులతో తమకొచ్చే మార్కులు పోల్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ అందోళన పడుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తగ్గినా బాధపడతారు. కొందరైతే ఎక్కువ వచ్చేవారిని చూసి అసూయపడి, ద్వేషం పెంచుకుంటారు. విద్యార్ధుల మధ్య పోటీ ఉండాలి, కాని అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే కావాలి. లేకపోతే ఆందోళనకు గురవుతారు. వచ్చేమార్కులు కూడా తగ్గిపోతాయి. అలాంటి బాధ లేకుండా ఉండటానికి ఈ క్రింది కథ చదవండి.
తాబేలు - కుందేలు కథ
ఒకరోజు తాబేలు, కుందేలు కబుర్లు చెప్పుకొంటున్నాయి. మధ్యలో కుందేలు తాబేలుతో ''పరుగు పందెంలో నన్నెవ్వరూ గెలవలేరు తెలుసా'' అని గర్వంగా అంది. కుందేలు అహంభావము, బద్ధకము తెలిసిన తాబేలు నాతో పందేనికి వస్తావా అంది. కుందేలు హేళనగా నవ్వి సరే అంది. రెండు రన్నింగ్ షూ వేసుకొని పరుగెత్తడం మొదలు పెట్టాయి. ముందు పరుగెత్తిన కుందేలు వెనక్కి తిరిగి చాలా దూరంలో వున్న తాబేలును చూసి, 'ఈ నత్తనడకల బుల్లెమ్మ'ను గెలవడానికి నేను ఇంత కష్టపడాలా అని అనుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొందామని ఒక చెట్టు క్రింద కూర్చున్నది. అంతలోనే నిద్రలోకి జారి పోయింది. అక్కడికి చేరిన తాబేలు కుందేలును చూసి నవ్వుకొని ముందుకు సాగింది. నిద్రలేచిన కుందేలు ఎక్కడా తాబేలు కనబడక పోవడంతో అదరాబాదరా పరుగెత్తింది కాని, అప్పటికే సమయం మించిపోయింది. గమ్యం చేరిన తాబేలు విజయహాసంతో ఎదురొచ్చింది.
తాబేలు ఓటమి కథ
ఓడిపోయిన కుందేలు దీర్ఘాలోచనలో పడింది. తన ఓటమికి కారణాలు విశ్లేషించింది. మితిమీరిన అహంభావమే తన ఓటమికి కారణమని గుర్తించి తాబేలు వద్దకు వెళ్లింది. ''మరలా పందేనికి వస్తావా'' అని అడిగింది. ''సరేపద'' అని బూటు లేసులు బిగించి తాబేలు పరుగెత్తింది. అయితే ఈ సారి కుందేలు లక్ష్యం పైనే గురివుంచి, ఎక్కడా ఆగకుండా పరుగెత్తింది. తాబేలును ఓడించింది.
తాబేలు చూపిన తెలివి కథ
ఓడిపోయిన తాబేలు ఆ రాత్రి భోజనం ముగించుకొని ఆరుబయట పచ్చికలో పడుకుని ప్రకృతిని చూస్తూ ఆలోచిస్తూ వుంది. ఈ సృష్టిలో పక్షులు ఎగరగలుగుతున్నాయి. చేపలు ఈదుతున్నాయి. కుందేలు వేగంగా పరుగెత్తుతుంది. మరి ఇలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన సామర్ధ్యం వున్నపుడు నాలో ఎలాంటి సామర్ధ్యం లేదా? కుందేలును ఓడించే మార్గం లేదా? తాబేలు మదిలో తళుక్కుమన్న ఓ ఆలోచన. హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి కుందేలు ఇంటి కాలింగ్‌బెల్ కొట్టింది.
తలుపు తీసుకొని నిద్రకళ్ళతో బయటకు వచ్చిన కుందేలు తాబేలును చూసి ఆశ్చర్యంగా ఏంటని అడిగింది. మరోసారి పందేనికి వస్తావా అంది. తాబేలు ధైర్యం ఏంటో అర్థంగాకపోయినా సరే పద అని కుందేలు బయలుదేరింది.
ఒకటి, రెండు, మూడు అని కుందేలు పరుగెెత్తబోతే తాబేలు ఆగు! అంది. మనం రెండుసార్లూ అటువైపు పరుగెత్తాం, ఈ రోజు ఇటువైపు ఆ దూరంగా కనబడుతున్న చెట్టువరకు వెళ్ళి వద్దాం అంది. ఓస్! ఇంతేనా అని రెడి చెప్పి కుందేలు వేగంగా పరుగెత్తింది. చిరునవ్వుతో తాబేలు నెమ్మదిగా వెనుక నడవడం మొదలుపెట్టింది.
బాణంలా దూసుకుపోతున్న కుందేలు ఒక్కసారి గుండె గుభిల్లుమనగా భయంతో ఆగిపోయింది. ఎదురుగా పెద్ద నది ప్రవహిస్తూ వుంది. గెలవాలని వున్నా దిగితే మునిగిపోతానని నది వడ్డునే కూర్చుండి పోయింది. నెమ్మదిగా అక్కడికి చేరిన తాబేలు కుందేలును పరామర్శించి నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి తిరిగి గమ్యం చేరింది. విజేత తాబేలేగా!
కుందేలు - తాబేలు కలసి గెలిచిన కథ
కుందేలు, తాబేలు గెలుపుకు బాధపడలేదు. దాని ఆలోచనకు, తెలివికి గెలిచిన తీరుకు ముచ్చటపడింది. ఇంకా ఇలా ఆలోచించింది. మొదటిసారి, మూడోసారి తాబేలు గెలిచింది. కాని అది గమ్యం చేరడానికి చాలా సమయం తీసుకుంది. రెండవసారి తాను త్వరగా గమ్యం చేరినా, మధ్యలో నది లేదు కాబట్టి సాధ్యమైంది. మొత్తం మీద ఎవరో ఒకరం గెలుస్తున్నాం. ఇద్దరం తక్కువ సమయంలో గెలవడానికి మార్గం లేదా? తలపై రెండుసార్లు నెమ్మదిగా చేత్తో కొట్టుకుంది - ఐడియా !
కుందేలు, తాబేలు వద్దకు వెళ్ళి ''ఇద్దరం గెలిచే ఆట ఆడదాం రా'' అంది. తాబేలు ''అదెలా'' అని అడిగింది. చూపిస్తాను రా అని తాబేలును తన వీపుపై ఎక్కించుకొని నదివున్న మార్గంలో వేగంగా పరుగెత్తింది. నది రాగానే తాబేలును దించి దానిపై తాను ఎక్కి కూర్చొని నది అవతల వడ్డుకు చేర్చమంది. కుందేలు తన ప్రతిభను గుర్తించినందుకు తాబేలు సంతోషంతో వేగంగా ఈదుతూ ఆవలి వడ్డుకు చేర్చింది. ఇదే విధంగా తిరిగి ఇద్దరూ బయలుదేరిన ప్రదేశానికి చేరారు. ఇప్పుడు చాలా తక్కువ సమయంలో నది అడ్డంవున్నా ఇద్దరూ గమ్యం చేరారు. ''ఇద్దరం గెలిచాం'' అంది తాబేలు సంతోషంగా.
ఇక్కడ అసూయా ద్వేషాలు లేవు, ఆందోళన లేదు. ఆనందం మాత్రమే వుంది. కాబట్టి విద్యార్ధులూ కలసి చదవండి, విజయం సాధించండి.

నీతి : గర్వం, అహంభావం వున్నవారికి, చిత్త శుద్దిలేని వారికి అపజయం తప్పదు. (నిదానమే ప్రధానమని కూడా చెబుతారు)
తాబేలు ఓటమి కథ
ఓడిపోయిన కుందేలు దీర్ఘాలోచనలో పడింది. తన ఓటమికి కారణాలు విశ్లేషించింది. మితిమీరిన అహంభావమే తన ఓటమికి కారణమని గుర్తించి తాబేలు వద్దకు వెళ్లింది. ''మరలా పందేనికి వస్తావా'' అని అడిగింది. ''సరేపద'' అని బూటు లేసులు బిగించి తాబేలు పరుగెత్తింది. అయితే ఈ సారి కుందేలు లక్ష్యం పైనే గురివుంచి, ఎక్కడా ఆగకుండా పరుగెత్తింది. తాబేలును ఓడించింది.
నీతి : లక్ష్యశుద్ది, పట్టుదల వున్నవారినే విజయం వరిస్తుంది
తాబేలు చూపిన తెలివి కథ
ఓడిపోయిన తాబేలు ఆ రాత్రి భోజనం ముగించుకొని ఆరుబయట పచ్చికలో పడుకుని ప్రకృతిని చూస్తూ ఆలోచిస్తూ వుంది. ఈ సృష్టిలో పక్షులు ఎగరగలుగుతున్నాయి. చేపలు ఈదుతున్నాయి. కుందేలు వేగంగా పరుగెత్తుతుంది. మరి ఇలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన సామర్ధ్యం వున్నపుడు నాలో ఎలాంటి సామర్ధ్యం లేదా? కుందేలును ఓడించే మార్గం లేదా? తాబేలు మదిలో తళుక్కుమన్న ఓ ఆలోచన. హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి కుందేలు ఇంటి కాలింగ్‌బెల్ కొట్టింది.
తలుపు తీసుకొని నిద్రకళ్ళతో బయటకు వచ్చిన కుందేలు తాబేలును చూసి ఆశ్చర్యంగా ఏంటని అడిగింది. మరోసారి పందేనికి వస్తావా అంది. తాబేలు ధైర్యం ఏంటో అర్థంగాకపోయినా సరే పద అని కుందేలు బయలుదేరింది.
ఒకటి, రెండు, మూడు అని కుందేలు పరుగెెత్తబోతే తాబేలు ఆగు! అంది. మనం రెండుసార్లూ అటువైపు పరుగెత్తాం, ఈ రోజు ఇటువైపు ఆ దూరంగా కనబడుతున్న చెట్టువరకు వెళ్ళి వద్దాం అంది. ఓస్! ఇంతేనా అని రెడి చెప్పి కుందేలు వేగంగా పరుగెత్తింది. చిరునవ్వుతో తాబేలు నెమ్మదిగా వెనుక నడవడం మొదలుపెట్టింది.
బాణంలా దూసుకుపోతున్న కుందేలు ఒక్కసారి గుండె గుభిల్లుమనగా భయంతో ఆగిపోయింది. ఎదురుగా పెద్ద నది ప్రవహిస్తూ వుంది. గెలవాలని వున్నా దిగితే మునిగిపోతానని నది వడ్డునే కూర్చుండి పోయింది. నెమ్మదిగా అక్కడికి చేరిన తాబేలు కుందేలును పరామర్శించి నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి తిరిగి గమ్యం చేరింది. విజేత తాబేలేగా!
నీతి : మీలో వున్న శిఖర నైపుణ్యాన్ని గుర్తించండి, గెలుపు మీదే
కుందేలు - తాబేలు కలసి గెలిచిన కథ
కుందేలు, తాబేలు గెలుపుకు బాధపడలేదు. దాని ఆలోచనకు, తెలివికి గెలిచిన తీరుకు ముచ్చటపడింది. ఇంకా ఇలా ఆలోచించింది. మొదటిసారి, మూడోసారి తాబేలు గెలిచింది. కాని అది గమ్యం చేరడానికి చాలా సమయం తీసుకుంది. రెండవసారి తాను త్వరగా గమ్యం చేరినా, మధ్యలో నది లేదు కాబట్టి సాధ్యమైంది. మొత్తం మీద ఎవరో ఒకరం గెలుస్తున్నాం. ఇద్దరం తక్కువ సమయంలో గెలవడానికి మార్గం లేదా? తలపై రెండుసార్లు నెమ్మదిగా చేత్తో కొట్టుకుంది - ఐడియా !
కుందేలు, తాబేలు వద్దకు వెళ్ళి ''ఇద్దరం గెలిచే ఆట ఆడదాం రా'' అంది. తాబేలు ''అదెలా'' అని అడిగింది. చూపిస్తాను రా అని తాబేలును తన వీపుపై ఎక్కించుకొని నదివున్న మార్గంలో వేగంగా పరుగెత్తింది. నది రాగానే తాబేలును దించి దానిపై తాను ఎక్కి కూర్చొని నది అవతల వడ్డుకు చేర్చమంది. కుందేలు తన ప్రతిభను గుర్తించినందుకు తాబేలు సంతోషంతో వేగంగా ఈదుతూ ఆవలి వడ్డుకు చేర్చింది. ఇదే విధంగా తిరిగి ఇద్దరూ బయలుదేరిన ప్రదేశానికి చేరారు. ఇప్పుడు చాలా తక్కువ సమయంలో నది అడ్డంవున్నా ఇద్దరూ గమ్యం చేరారు. ''ఇద్దరం గెలిచాం'' అంది తాబేలు సంతోషంగా.
ఇక్కడ అసూయా ద్వేషాలు లేవు, ఆందోళన లేదు. ఆనందం మాత్రమే వుంది. కాబట్టి విద్యార్ధులూ కలసి చదవండి, విజయం సాధించండి.
*నీతి : సృజనాత్మకతతో కలసి పనిచేస్తే గెలుపు మీదే *