Tuesday, April 16, 2019

పనులు వాయిదా వెయ్యడం

Source: behappy.org.in



కొందరు ఎంతో ముఖ్యమైన పనులను కూడా సకాలంలో పూర్తి చేయరు. తరచూ వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదా వేయడం వల్ల ముందు ముందు ఎంతో నష్టపోతారు. బద్దకానికి దీనికీ ఉన్న తేడా, బద్దకస్తులకు పనిచేయడానికి ఇష్టం ఉండదు, వాయిదా వేసేవారు పనులు సకాలంలో పూర్తి చెయ్యరు.


                   కారణాలు
·        ఆకర్షణలు
·        పని తప్పించుకోవడం
·        సరిగా చెయ్యలేననే భయం
·        శక్తికి మించిన లక్ష్యం పెట్టుకోవడం
·        క్రమశిక్షణ లేకపోవడం
·        ఊహల్లో జీవించడం
·        బాధ్యత తెలియక పోవడం
·        బద్దకం
·        వ్యక్తిగత సమస్యలు
·        సమయం విలువ తెలియకపోవడం
·        మానసిక వత్తిడి
·        బలహీనతలు 
·        చెడు అలవాట్లు
·        జన్యువులు


నష్టాలు
·        మంచి ఉద్యోగం రాదు.
·        అనుకున్న లక్ష్యం సాధించలేరు.
·        భవిష్యత్తులో మానసికంగా క్రుంగిపోతారు.
·        ఇంతా బయటా గౌరవం పోగొట్టుకుంటారు.
·        జీవితం అశాంతిగా ఉంటుంది.
·        డబ్బు నష్టపోతారు.
·        విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటారు.
·        మంచి ఉద్యోగం రాదు.


పరిష్కారమార్గం
·        జీవితం విలువ అర్ధం చేసుకోండి.
·        పనులు వాయిదా వల్ల కలిగే నష్టాలను ప్రతిరోజూ గుర్తు చేసుకోండి.
·       తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యతను గుర్తించండి.
·    చేయవలసిన పనులను ఒక చోట రాసుకొని అన్నీ పూర్తి చేసేవరకు పేపరు మీతోనే   ఉంచుకోండి. 
·       మొదట ముఖ్యమైన పనులను వెంటనే చేయడం అలవాటు చేసుకోండి.
·       నెమ్మదిగా అన్నిపనులు సకాలంలో పూర్తిచెయ్యండి.



*వాయిదా పద్ధతి వదిలితే విజయం మీదే* 



సంబంధిత వెబ్‌సైట్లు:

http://en.wikipedia.org/wiki/Procrastination
http://www.mindtools.com/pages/article/newHTE_96.htm
http://www.counselling.cam.ac.uk/selfhelp/leaflets/procrastination