Tuesday, April 2, 2019

మన గురించి తెలుసుకుందాం


చిన్నతనంలో తల్లిదండ్రులు అమ్మ, నాన్న, కుక్క, పిల్లి, ఇలా అనేక మాటలు నేర్పుతారు. మంచి-చెడులు వివరించటానికి ప్రయత్నిస్తారు. పాఠశాలలో, కళాశాలలో పరిసరాల గురించి, సామాజిక, వైజ్ఞానిక అంశాల గురించి, ఇంకా ఇంటర్వూలు ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో శిక్షణ ఇస్టారు . అయితే చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. విద్యార్ధి చదువుకుంటూ కూడా ప్రతీరోజు ఇంటా బయట జీవించాలి. ఈ జీవించడంలో అనేక సమస్యలు ఎదుర్కొవాలి. అయితే జీవితం గురించి,  దాన్ని ఎలా నడుపుకోవాలన్న విషయం గురించి మాత్రం శిక్షణ నివ్వడం లేదు, చాలా మంది పట్టించు కోవడం లేదు కుడా.

అందువల్ల ప్రస్తుత సమాజంలో...........
  • పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో తెలియకుండానే పెద్దవాళ్ళవుతున్నారు. 
  • అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్ళతో ఎలా ఉండాలో తెలియకుండానే పెద్దవాళ్ళవుతున్నారు.
  • టీచర్లతో ఎలావుండాలో తెలియకుండానే చదువులు పూర్తి చేస్తున్నారు.
  • ప్రేమకు అర్ధం తెలియకుండానే ప్రేమిస్తున్నారు.
  • భార్య, భర్తలు అంటే ఏమిటో తెలియకుండానే పెళ్ళి చేసుకుంటున్నారు.
  • పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే పిల్లల్ని కంటున్నారు.
  • జీవితాన్ని ఎలా నదుపుకోవాలో తెలియకుండానే నడుపుతున్నారు.
  • సమయం విలువ తెలియకుండానే సమయాన్ని గడుపుతున్నారు.
  • శరీరం విలువ తెలియకుండానే శరీరాన్ని ఉపయోగిస్తున్నారు.
  • జీవితం విలువ అంటే ఏమిటో తెలియకుండానే జీవిస్తున్నారు.
  • చావు పుట్టులకు అర్ధం తెలియకుండానే చనిపోతున్నారు.

కాబట్టి ప్రతిఒక్కరూ ఈ విషయాల గురించి తెలుసుకోవాలి.

1. లక్ష్యం
  • నీ లక్ష్యం ఏమిటి?
  • లక్ష్యసాధనకు ఏం చేస్తున్నావు ?
2. చదువు
  • బాగా చదువుకోవడానికి అడ్డంకులేమైనా ఉన్నాయా ?
  • జాగ్రత్తలేమైనా తీసుకోవాలా ?
3. ఆరోగ్యం
  • ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా ?
  • జాగ్రత్తలేమైనా తీసుకోవాలా ?
4.  వ్యక్తిత్వం
  • వ్యక్తిత్వంలో లోపాలేమైనా ఉన్నాయా ?
  • జాగ్రత్తలేమైనా తీసుకోవాలా ?
5. భవిష్యత్తు
  • భవిష్యత్తు ఎలా ఉండటానికి అవకాశం ఉంది ?
  • జాగ్రత్తలేమైనా తీసుకోవాలా ?
6. జీవితం
  • ఈ జీవితం ఎందుకు ఇవ్వబడింది ?
  • ఈ జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ?
ఆసక్తి వున్న వారు   behappy.org.in వెబ్సైటు లోని  మీకు  సంభందించిన  ప్రశ్నావళిని పూర్తీ చేసి మీ బలహీనతలను అర్ధం చేసుకుని, సరిచేసుకుని జీవితంలో విజేతలుగా నిలవండి. Wish you all the best.

*మనం  మనకు అర్ధమైతే, ప్రపంచం మనకు చాలా తేలిగ్గా అర్ధమవుతుంది*

Source: behappy.org.in