Monday, April 1, 2019

సమస్య పరిష్కారం, నిర్ణయ శక్తి

source: behappy.org.in

ప్రతి వ్యక్తి తన జీవితంలో రకరకాల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది.కొన్నిసార్లు ఒకటికి మించి పరిష్కార మార్గాలు ఉండవచ్చు.  వానిలో అనువైన పరిష్కారాన్ని ఎన్నుకోవడాన్ని నిర్ణయశక్తి అంటారు.  సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను విద్యార్ధి దశలోనే నేర్చుకుంటే ముందుముందు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

సమస్యలను పరిష్కరించుకునే పద్ధతులను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

సమస్యను నిర్వచించడం :మొదట సమస్యను గురించి పూర్తిగా అర్ధంచేసుకోవాలి.

సమాచార సేకరణ : రెండవ దశలో మన సమస్యకు సంబంధించిన
                                                   సమాచారాన్ని సేకరించాలి.

ప్రత్యమ్నాయ మార్గములు : సమస్యను పరిష్కరించడానికి ఏయే మార్గాలున్నాయో                                                                        ఆలోచించాలి.                                                                   

నిర్ణయం                             : సమస్యను పరిష్కరించడానికి ఉన్న మార్గాలలో
                                                  ఏది అనుకూలమైనదో నిర్ణయించుకోవాలి.

ఆచరణ                              : నిర్ణయించుకున్న పద్ధతిని ఆచరణలో పెట్టాలి.



*నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి*