Monday, April 1, 2019

ఆత్మహత్య

పోస్ట్ చేసిన వారు: లైఫ్ స్కిల్స్ శంకర్
Source: behappy.org.in
Designed by Jcomp - Freepik.com

ఆత్మ అంటే  శక్తి. మనిషిలోని అణువణువులోను వ్యక్తమవుతున్న విద్యుత్‌ అయాస్కాంత శక్తే ఆత్మ. దాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. చేసేది ఈ భౌతిక శరీరాన్ని హత్య చెయ్యడమే. చనిపోవడానికి తెగింపు ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు. ఆత్మహత్య చేసుకునే బదులు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే దాదాపు 90 శాతం ఆత్మహత్యలు జరగవు.

ఆత్మహత్యలకు కారణాలు 

  • అన్ని సమస్యలకు పరిష్కారం చావేననే భావన
  • తగ్గని జబ్బు
  • భరించలేని శారీరక బాధ
  • భరించలేని మానసిక బాధ
  • బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోవడం
  • విడాకులు / దూరంగా ఉండాల్సిరావడం
  • ఆర్థిక ఇబ్బందులు
  • పరువు పోతుందనే భయం
  • ఆపుకోలేని ఆవేశం / ఉక్రోషం
  • తీవ్రమైన నిరాశ
  • సరిదిద్దుకోలేని తప్పు చెయ్యడం
  • నిస్సహాయ స్థితి
  • బెదిరింపులు
  • కోర్టు కేసులు
  • అవమానం జరుగుతుందని
  • అవమానం భరించలేక
  • ఓటమి భరించలేక
  • డ్రగ్స్‌కు బానిసకావడం
  • త్రాగుడుకు బానిసకావడం
  • భార్య-భర్తల మధ్య తరచు గొడవలు
  • పరీక్షల్లో ఫెయిలవడం
  •  ర్యాగింగ్‌
  • జన్యువులు
పైన పేర్కొన్న కారణాల్లో ఏవో 2,3 మినహా మిగిలినవి ఏవీ సరియైన కారణాలు కావు. 
ఆత్మహత్య చేసుకోవాలని కోరిక కలిగినవారు హోమియోపతివైద్యంలో మందులు ఉన్నాయి, 
వాడుకొని మంచి భవిష్యత్తువైపు అడుగు వెయ్యండి.

పరిష్కార మార్గాలు

  • కుటుంబ చరిత్రలో ఆత్మహత్య చేసుకొన్న వారుంటే ఆ లక్షణం  జన్యువుల ద్వారా పిల్లలకు రావచ్చు.
  • పైన చెప్పిన కారణాలలో దేనివల్లనైనా  ఎవరైనా బాధపడుతుంటే వారిని వంటరిగా వదలకండి. అలాంటి వారికి దగ్గరలో హానిచేసుకొనే పరికారాలు ఏవీ ఉంచకండి.
  • వీలయినంత త్వరగా సైకాలజిస్ట్‌ని సంప్రదించండి.
  • నలుగురు కలసి ధైర్యం చెప్పండి.
  • పుట్టిన ప్రతి వారు తప్పక చనిపోతారు. ఇంతలోనే తొందరపడాల్సిన   పనిలేదు.
  • కాలం అన్నింటికన్నా శక్తి వంతమైనది. ఓర్పుతో ఉంటే అదే పరిష్కారం చూపిస్తుంది, నమ్మండి.
                                  *చనిపోయే ధైర్యంఉంటే  బ్రతికి సాధించగలిగింది ఎంతోఉంది*