Source: behappy.org.in
భార్య కుటుంబం బాగోగులు చూస్తుంది. పని మనిషిలా పనిచేస్తుంది. బిడ్డలను ప్రాణంగా పెంచుతుంది. భర్త బయటి వ్యవహారాలు చక్కదిద్దుతాడు. ఇద్దరూ తామూ సంపాదించింది కుటుంబానికి ఖర్చుచేస్తాడు. పిల్లలకోసం శ్రమపడతాడు, తాపత్రయపడతాడు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు మంచి చెడులు చెపుతారు కాని కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు పలుచబడిపోతున్నాయి. భార్యా భర్తల మధ్య, పిల్లలు-తల్లి దండ్రుల మధ్య దూరం పెరిగిపోతోంది.
ఎందుకిలా జరుగుతోంది?
తల్లిదండ్రుల భావన
- పిల్లలు మొండిగా ఉంటున్నారు.
- చెడు అలవాట్లకు లోనవుతున్నారు.
- మంచి మాటలు చెప్పినా వినడంలేదు.
- సమయాన్ని టి.వి., కంప్యూటర్లు, ఆటలతో గడుపుతున్నారు.
- ఆర్థికపరిస్థితి గమనించకుండా డబ్బు దుబారా చేస్తున్నారు.
- చదువు పట్ల ఆసక్తి చూపడంలేదు.
- చేయగలిగిన చిన్న సాయం కూడా చెయ్యరు.
- ప్రేమ పేరుతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు.
- భవిష్యత్తు గురించి బాధ లేదు.
పిల్లల్లో భావన
- ప్రతీ విషయంలో పదేపదే చెప్పిన సలహాలే చెబుతారు.
- స్వేచ్చ లేదు.
- ఎప్పుడూ చదువు, మార్కుల గురించి తిడతారు.
- మాముందే తన్నుకుంటూ ఇంట్లో అశాంతిని సృష్టిస్తున్నారు.
- పెద్దవాళ్ళే చెడు అలవాట్లు మానలేకపోతే మేం మానగలమా?
- చదువుకునేటప్పుడు ప్రేమలో పడకపోతే చదువు అయ్యాక మా ముఖం ఎవరు చూస్తారు?
- మీరు బాధ పడేది చాలక భవిష్యత్తు గురించి మమ్మల్ని కూడా టెన్షన్ పెడతారు.
తల్లిదండ్రుల భావాలను కొందరు పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఈ కథ తెలియజేస్తుంది.
పూర్వం భారవి అనే మహాకవి ఉండేవాడు. అతను కవిత్వం చెప్పడం మొదలు పెట్టిన రోజుల్లో విన్న ప్రతివాళ్ళు తెగమెచ్చుకునేవారు. తండ్రితో కలసి నగరవీధుల్లో వెళుతుంటే, ప్రజలు తండ్రితో '' మీరు చాలా అదృష్టవంతులు, గొప్పకొడుకుని కన్నారు, మీ అబ్బాయి కవిత్వం అద్భుతంగా చెపుతున్నారు'' అనేవారు. అది విన్న తండ్రి వాడి మొఖం, ఏదో తెలిసి తెలియని కవిత్వం చెబుతున్నాడు అనేవారు.
భారవి తండ్రి మాటలకు నొచ్చుకున్నాడు. మరొసారి కూడా తండ్రి అలానే అన్నాడు. భారవి ''తన తండ్రికి తనను పొగడటం ఇష్టంలేదు, నా కవిత్వాన్ని చూసి అసూయపడుతున్నట్లుంది, ఎవరైనా కొడుకును పొగిడితే, తనూ మెచ్చుకోవాలి గాని ఇలా తక్కువ చేసి మాట్లాడరు '' అనుకున్నాడు.
మూడవసారి కూడా భారవి తండ్రి నుండి అలాంటి మాటలే విన్నాడు. ఆవేశం పట్టలేకపోయాడు. నా తండ్రి బ్రతికి ఉన్నంతవరకు నాకు మంచి పేరురాదు, కాబట్టి తండ్రిని చంపెయడమే మంచిదనుకున్నాడు. ఆరోజు రాత్రి 12 గం||లకు పథకం రచించాడు. అర్ధరాత్రి అయితే ఇలాంటి వాటికి మంచి ఉపాయం దొరుకుతుంది. మరునాడు ఉదయం 8గం||లకు వంటగదిలో అన్నం తినేటప్పుడు చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రిపూట ఒక పెద్ద బండను వంటగదిలోని అటక మీదకు చేర్చాడు. అటకపైనుండి చిన్న రాళ్ళను తండ్రి భోజనానికి కూర్చొనే ప్రదేశంపైకి విసరి చూసాడు. గురి బాగానే ఉంది. అటక దిగి నిద్రపొయ్యాడు.
ఉదయం అమ్మా,నాన్న చూడకుండా 7.30 ని||లకు అటకపైకి ఎక్కి కూర్చున్నాడు. 7.55 ని||లకు తండ్రి వంటగదిలో పీటపై కూర్చున్నాడు. భారవి తల్లి కంచంలోఅన్నం వడ్డిస్తూ ఇలా అంది. తండ్రి నెత్తి పైన వేయడానికి పైకెత్తిన బండను ప్రక్కన పెట్టి భారవి వారి మాటలు వినసాగాడు.
తల్లి : మీ పద్ధతి ఏం బాగాలేదు. భారవి బాధపడుతున్నాడు.
తండ్రి : వాడికి బాధేంటి!? చక్కగా కవిత్వం చెబుతున్నాడు. నలుగురితో 'సెభాష్' అనిపించు
కుంటున్నాడు.
తల్లి : వాడి బాధకు కారణం మీ మాటలే.
తండ్రి : నేనేం అన్నాను?
తల్లి : అందరూ మెచ్చుకుంటుంటే మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారట!
తండ్రి : అరే! నా మాటల్ని వాడు అలా అర్థం చేసుకున్నాడా! మన పిల్లల్ని ఎవరైనా పొగిడితే,
మనం కూడ వారి ముందు పొగడకూడదు. వాళ్ళు చాటుకుపోయి మరో రకంగా
మాట్లాడతారు. ఏముందిలే అని నేను అంటే కాదు చాలా బాగుంది అని వాళ్ళు అనాలి.
భారవి అంటే నీకు నాకు ప్రాణం. వాడు నల్గురిలో విలువగా బ్రతకాలి.ఇంకా చాలా
మందితో గొప్పవాడు అనిపించుకోవాలి.
మనం కూడ వారి ముందు పొగడకూడదు. వాళ్ళు చాటుకుపోయి మరో రకంగా
మాట్లాడతారు. ఏముందిలే అని నేను అంటే కాదు చాలా బాగుంది అని వాళ్ళు అనాలి.
భారవి అంటే నీకు నాకు ప్రాణం. వాడు నల్గురిలో విలువగా బ్రతకాలి.ఇంకా చాలా
మందితో గొప్పవాడు అనిపించుకోవాలి.
తండ్రి అలా మాట్లాడుతుండగా, ఆయన ప్రక్కన పెద్ద బండ పడిన శబ్ధం అయ్యింది. తండ్రి లేచి పరుగెత్తబోయాడు కాని కాలు ఎవరో పట్టుకొని లాగుతున్నారు. భయంగా క్రిందకు చూసాడు. భారవి కాలు పట్టుకుని క్షమించు తండ్రి అంటున్నాడు. ప్రక్కనే పెద్ద బండ ఉంది.
తండ్రి : ఏమిటిదంతా!?
భారవి : మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి.
తండ్రి : ఎందుకు?
భారవి : అమ్మ మాట్లాడటం ఒక్క నిముషం ఆలస్యం అయిఉంటే నిన్ను ఈ బండతో చంపేసి
ఉండేవాడ్నే.
ఉండేవాడ్నే.
మరి మీ తల్లిదండ్రుల్ని మీరు సక్రమంగా అర్థం చేసుకున్నారా?
భార్య-భర్తల సంబంధాలు
చాలా మంది భార్య-భర్తలు చిన్న చిన్న విషయాలలోనే సర్దుకు పోలేకపోతున్నారు. వీళ్ళ కీచులాటలకి కారణాలు చూద్దాం.
భర్త చెప్పే కారణాలు
|
భార్య చెప్పే కారణాలు
|
తనమాటే నెగ్గాలని అంటుంది.
|
తనమాటే నెగ్గాలంటాడు.
|
అన్ని చెప్పి చెయ్యాలంటుంది.
|
నా మాటకు విలువ ఇవ్వడు.
|
నా వాళ్ళు వస్తే సరిగా చూడదు
|
నా వాళ్ళను అవమానిస్తాడు.
|
డబ్బుల పెత్తనం తనే చెయ్యాలంటుంది.
|
అవసరాలకు కూడా సరిగా డబ్బులివ్వడు.
|
నాతోనే ఎక్కువ సేపు మాట్లాడాలి అంటుంది
|
పిల్లలు పుట్టాక నాతో సరిగా మాట్లాడటం లేదు.
|
ఇంట్లో ఏది కొన్నా ముందుగా చెప్పాలి అంటుంది.
|
ఏదైనా కొనే ముందు అసలు చెప్పడు.
|
పిల్లలు చెప్పిందే నమ్ముతాను అంటుంది
|
పిల్లల కిచ్చే విలువ నాకివ్వడు.
|
పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేస్తాను అంటుంది.
|
నాకు కావలసినవి పట్టించుకోడు.
|
ఇతర కారణాలు
- చెడు అలవాట్లు
- అక్రమ సంబంధాలు
- ఆరోగ్య సమస్యలు
- ఆర్థిక కారణాలు
- సెక్స్ సమస్యలు
*సర్దుకు పోగలిగితే ఇళ్ళే స్వర్గం , లేకపోతే అదే నరకం*
No comments:
Post a Comment