Sunday, April 7, 2019

మనిషి ప్రవర్తనే ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు

నేటి ప్రపంచం ముందు ఎన్నొ సమస్యలు సవాళ్ళుగా నిలిచాయి. ఉదాహరణకి వాతావరణంలో  మార్పులు, పేదరికం, ఉగ్రవాదం, అణు యుద్ధాలు, భూకంపాలుతుఫాన్లు మొదలైనవి.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఆధారంగా ఎందరో శాస్త్రవేత్తలుబాధ్యత కలిగిన అధి కారులు ఈ   సవాళ్ళకు పరిష్కారం సూచించారు. సూచనల అమలుకు  వివిధ దేశాల  ప్రభుత్వాలు ఐక్య రాజ్యసమితి,  ప్రపంచ బ్యాంకుయునిసెఫ్ వంటి   అంతర్జాతీయ సంస్థలు వేల కోట్ల రూపాయలు వెచ్చిం చాయి.  అయితే సమస్య తీసుకున్నా  కొద్ది శాతం మాత్రమే పరిష్కార మయ్యింది. సరికొత్త సవాళ్లు మాత్రం పుట్టుకొస్తూనే వున్నాయి. దీనికి మూల కారణం పరిశీలించి, సమస్యల సంపూర్ణ  పరిష్కారానికి ప్రయత్నిస్తే, వేల కోట్ల రూపాయలు ఆదా కావడంతో పాటు శాంతి బధ్రతలు విలసిల్లే సుహ్రుద్భావ  ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. 


నైతిక విలువల పతనం

గడచిన కాలాన్ని పరిశీలిస్తే సత్యంధర్మంన్యాయంజాలిదయపరస్పర సహకారం మొదలైన విలువలు దారుణంగా పతనమైనట్లు  అర్థమవుతుంది.  అసాంఘిక కార్యకలాపాలు హింస నేరాలు మోసాలు క్రమశిక్షణారాహిత్యంచట్టాల ఉల్లంఘనలైంగిక దాడులువేధింపులుఅధికారుల మరియు రాజకీయ నాయకుల  అవినీతిఅభద్రతఅశాంతిదురలవాట్లు ఊహించలేనంతగా పెరిగాయి. మానవ స్వభావంలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపిస్తోంది. అహంకారపూరిత ప్రవర్తన, స్వార్థంపక్షపాతంఆధిపత్య ప్రదర్శన సర్వత్రా కనిపిస్తున్నాయి. డబ్బుఅధికారం మరియు శృంగారం కోసం వెంపర్లాట పెరిగిపోయింది (పటము 1).


  పటము 1. కాలం తో పాటు జరిగిన నైతిక విలువల పతనం 
(అసాంఘిక కార్యకలాపాలు హింసనేరాలు  మోసాలు క్రమశిక్షణా రాహిత్యంచట్టాల 
 ఉల్లంఘనలైంగిక   దాడులువేధింపులుఅధికారుల మరియు రాజకీయ  నాయకుల 
 అవినీతి,  అభద్రతఅశాంతిదురలవాట్లు)

సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయాలను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది- “ ప్రజలు విశ్వసనీయత లేని ప్రపంచాన్ని చూస్తున్నారు,వారు అశాంతిఅభద్రతల  మధ్య కొట్టు మిట్టాడుతున్నారు, వివిధ దేశాల్లో రాజకీయ నాయకులపై  ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది, ప్రపంచ దేశాల మధ్య సహకారం తగ్గిపోతోంది, ప్రపంచం మొత్తం అనుసంధానం జరిగింది కానీ మానవ సమాజం ముక్క లయ్యింది, స్వలాభాపరులు పెరిగి పోతున్నారు, సమస్యలు పెరిగిపోతున్నాయి,  ప్రకృతి విపత్తుల తీవ్రతకూడా పెరిగి పోయింది”.


నైతిక విలువల పతనంఇతర సామాజిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచం నిజమైన మనుషులు జీవించడానికి అనువుగా వుండకపోవచ్చు. అదే జరిగితే యుగాంతం తప్పదేమో?

ప్రపంచం ముందున్న సవాళ్ళు
 వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి

1. ప్రకృతి విసరుతున్నసవాళ్లు (Natural Challenges)

  • భూకంపాలు
  • అగ్నిపర్వత విస్ఫోటనాలు 
  • భూపాతాలు 
  • తుఫానులు
  • వరదలు 
  • సునామి  
  • ఉష్ణ అలలు 

2. మానిషి సృష్టించిన సవాళ్ళు (Manmade Cahallenges)
  • వాతావరణ మార్పులు 
  • అణు యుద్ధాలు
  • అంటువ్యాధులు 
  • పేదరికం మరియు ఆకలి
  • ఉగ్రవాదం
  • జనాభా పెరుగుదల
  • కృత్రిమ మేధ 
  • సాంకేతిక అభివృద్ధీ 
  • ఆహార కల్తీ 
  • కాలుష్యం 
  • నీటి ఎద్దడి 
  • అవినీతి 
  • నైతిక విలువల పతనం 
  • మనుషుల ప్రవర్తన 
పరిష్కారం

ప్రకృతి విసురుతున్న సవాళ్లకు పరిష్కారం- ముందుగా వాటిని  పసిగట్టడంనష్టాన్ని తగ్గించుకోవడం మరియు విపత్తు ఏర్పడితే సహాయం చేయడం.

ప్రస్తుత పరిస్థితుల్లో భూకంపాలుసునామీ వంటి విపత్తులు రాకుండా నిరోధించే సాంకేతికత ఇంకా  అభివృద్ది కాలేదు. విపత్తులు సంభవించినప్పుడల్లా ప్రభుత్వాలుస్వచ్ఛంద సేవా సంస్థలుదాతలు వేల కోట్ల రూపా యలు సహాయం అందిస్తున్నారు. విపత్తుల సమయంలో పరిస్తితులు హృదయ విదారకంగా వుంటాయి. సమయంలో చేతనైతే తనవంతు పదో పరకో సహాయం చేయాల్సింది పోయి సంబధిత అధికారులలో కొందరు, ఆపన్నుల సహాయం కోసం విడుదల చేసిన డబ్బు కోసం కూడా కక్కుర్తి పడుతున్నారు. అలాంటి స్వార్ధ పరుల వైఖరి మార్చవలసి ఉంది/ మార్చాల్సివుంది.

ప్రకృతి విసురుతున్న సవాళ్లను అధిగమించలేని స్థితిలో ఉన్న మానవజాతి సరికొత్త సవాళ్లకు తానే తెరతీసింది. కొందరు స్వార్థబుద్ధితో  తానుతన కుటుంబం బాగుంటే చాలుమిగతావారు ఏమైపోయినా ఫర్వాలేదనే స్థాయికి దిగజారి పోయారు. ఇలాంటి వారి వల్ల వాతావరణంలో మార్పులుతద్వారా ఎన్నో వినాశకర ఫలితాలు కలిగాయి. కొద్దిమంది స్వలాభాపేక్ష ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల పాలిట శాపంగా మారింది. ఆధిపత్య పోరాటంలో భాగంగా అణుయుద్ధాలు ప్రజలను జడిపిస్తున్నాయి.

అవినీతిఅనైతికతకాలుష్యంఆహార కల్తీపేదరికంఉగ్రవాదంనీటి ఎద్దడి- ఇవన్నీ కేవలం మనిషి చెడు ఆలోచనల నుండే పుట్టుకొచ్చాయి. కాబట్టి పైన పేర్కొన్న ప్రపంచ సమస్యల కన్నా అతి పెద్ద సమస్య మనిషి వైఖరి (human attitude) అని చెప్పవచ్చు. వైఖరిలో మార్పు వచ్చినప్పుడే ప్రపంచ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది. మనిషి ఆశించే నిజమైన సంతోషం దొరుకుతుంది.


మనిషి వైఖరిని మార్చడమెలా?


ఇందుకుగాను ఒక నమూనా రూపోందించి ఇక్కడ పొందుపరచడం జరిగింది (పటము 2).




మనిషి వైఖరిలో మార్పు తీసుకురావడానికి మూడు విషయాలపై అవగాహన కల్పించాలి.

1. మానవ శరీర శాస్త్రం 

దీన్ని గురించి తెలుసుకోవాలంటే 
  • మనిషికి సంబంధించిన నిజాలు 
  • మనిషిని ఎవరు నియంత్రిస్తున్నారు
  • కారణం లేకుండా ఏదైనా సంభవిస్తుందా
  • ప్రకృతిని అర్థం చేసుకోవడం ఎలా?
  • చెడు ప్రవర్తనలవల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది 
  • నైతిక విలువలు ఎందుకు పతనం  అవుతున్నాయి అన్న విషయాలు తెలుసుకోవాలి.


2. భావోద్వేగాలతో ఆరోగ్యానికి ఉన్న సంబంధం

సంబంధం తెలియాలంటే 
  • భావోద్వేగాలు 
  • మెదడు తరంగాలు 
  • హృదయస్పందనలో తేడాలు 
  • హార్మోన్లు మరియు న్యూరోట్రాన్స్ మిటర్లు మరియు 
  • మనుషుల స్వభావాలు అర్థం కావాలి. 



3. జీవన నైపుణ్యాలు 

వీటిలో ప్రధానమైనవి 
  • జీవితాన్ని నడుపుకోవడం ఎలా?
  • మీ గురించి మీకు తెలుసా?
  • జీవితం విలువ ఎంత?
  • సమయం విలువ ఎంత?
  • దేహం విలువ ఎంత?
  • సమస్య పరిష్కారం, నిర్ణయాత్మక శక్తి ఉందా
  • ఆధ్యాత్మిక ప్రజ్ఞ మరియు 
  • ధ్యానం గురించి తెలుసుకోవాలి. 



మరిన్ని వివరాల కోసం lifeskillssankar.blogspot.com చూడండి.

*మనిషి వైఖరి మారకపోతే యుగాంతం తప్పదు*

*****

No comments:

Post a Comment