లక్ష్యం లేని జీవితం అయోమయంగా ఉంటుంది. మీరు గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లాలి అనుకున్నారను కోండి, కావలసిన బస్సు లేదా రైలు ఎక్కుతారు. అసలు ఏ ఊరు వెళ్లాలో తెలియదనుకోండి, ఎటువైపు వెళ్ళాలో తెలియక అయోమయంగా ఉంటారు. అలాగే జీవితానికి కూడా ఒక లక్ష్యం లేకపోతే ఏం చేయాలో తెలియదు. ఇప్పటివరకు మీరు లక్ష్యం నిర్ణయించు కొనాకపోతే వెంటనే సరిఅయిన లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి.
ఉపయోగాలు
- జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతాం.
- అందుకు కావలసిన నైపుణ్యాలు పెంచుకుంటాం.
- గమ్యం చేరటానికి ఏం చేయాలో ఆలోచించుకుంటాం.
- అందువల్ల మనం సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామో లేదో అర్థమవుతుంది.
- సరైన మార్గంలో నడిస్తే సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన, విజయవంతమైన జీవితం అందుతుంది.
లక్ష్యాలను మూడు రకాలుగా విభజించ వచ్చు. అవి
- ప్రాథమిక లక్ష్యాలు
- ద్వితీయ లక్ష్యాలు మరియు
- తృతీయ లక్షణాలు
స్వల్పకాలిక
మధ్యంతర
దీర్ఘకాలిక
ప్రాథమిక లక్ష్యాలు
మనిషి ఏ లక్ష్యం పెట్టుకున్నా అది డబ్బు సంపాదన కావచ్చు లేదా అధికారం కోసం కావచ్చు, వాటిద్యార చివరకు కోరుకునేది మాత్రం సంతోషం మరియు సంతృప్తి. ఎవరైనా మీకు డబ్బు కావాలా, సంతోషకరమైన జేవితం కావాలా అంటే రెండవదే కోరుకుంటాం. అలాగే ప్రశాంతత కావాలా, డబ్బు కావాలా అని అడిగితే ప్రశాంతత అంటాం. కాని వాస్తవంలో సంతోషం, ప్రశాంత తలను పోగొట్టుకుని డబ్బు అధికారం లేదా శృంగారం కోసం వెంపర్లాడుతున్నాం. మనుషు లందరు శ్వాస ఆడితేనే జీవిస్తున్నారు, గుండె కొట్టుకుంటీనే జీవిస్తున్నారు. అలాగే అందరికీ పంచేంద్రియాలు ఒకేవిధంగా ఉపయోగపడుతున్నాయి, అంటే కళ్ళు చూడటానికి, నోరు తినటానికి, ముక్కు వాసన చూడటానికి, ఇలాగ ఇవన్నీ మనిష్య జాతికి సర్వసాధారణం అయినప్పుడు మనిషికీ మనిషికి లక్ష్యం ఎందుకు మారుతుంది? సమాధానం వ్యక్తిత్వాన్ని బట్టి అని అంటారు, నిజమే కానీ వ్యక్తిత్వంలో తేడావల్ల తృతీయ లక్ష్యాలు మారవచ్చు కాని ప్రథమ ద్వితీయ లక్ష్యాలు మారవు. ఈ రెండు (సంతోషం మరియు సంతృప్తి) మానవజాతికి జీవిత లక్ష్యాలు మరియు శాశ్వత లక్ష్యాలు. ఈ సత్యాన్ని గమనించకుండా తృతీయ లక్ష్యాలను జీవితలక్ష్యాలు అనుకుని బ్రతికితే చివరికి దుఃఖం, అశాంతి, అనారోగ్య జీవితమే మిగులుతుంది.
ద్వితీయ లక్ష్యాలు
సంతోషంతో, సంతృప్తితో జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి, ప్రశాంతత ఉండాలి. ఈ ద్వితీయ లక్ష్యాలే ప్రాధమిక లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడతాయి.
తృతీయ లక్ష్యాలు
ఉదాహరణకు ప్రతి మనిషికి ఏదోక లక్ష్యం ఉంటుంది. అది కష్టపడి పనిచేయడం లేదా సోమరిగా కూర్చోటం, ఏదైనా వృత్తిని ఎన్నుకోవచ్చు, లేదా నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుందాం, ఇలా అయినా కావచ్చు. తృతీయ లక్ష్యాలను మూడుడురకాలుగా విభజించ వచ్చు.
స్వల్పకాలిక లక్ష్యాలు: ఇవి రోజు రోజుకు లేదా
వారానికి మారిపోవచ్చు, ఉదాహరణకి
ఈ రోజు ఒక పెళ్ళికి వెళ్ళాలి,
కరెంట్ బిల్లు చెల్లించాలి, విద్యార్థి వారాంతపు
పరీక్షకు వ్రాయాలి, ఇవన్నీ
స్వల్పకాలిక లక్ష్యాలు.
మధ్యంతర
లక్ష్యాలు: పదో
తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పేరున్న డాక్టర్ కావాలంటే ముందుగా ఇంటర్మీడియట్
పాస్ కావాలి. అదే ఒక లక్ష రూపాయలు దగ్గర ఉంచుకొని పది సంవత్సరాలలో పది కోట్లు
సంపాదించాలంటే రెండు సంవత్సరాలకు ఒకకోటి, మూడు సంవత్సరాలకు మూడు కోట్లు, ఇలా మధ్యలో పెట్టుకునే లక్ష్యాలే మధ్యంతర లక్ష్యాలు అవుతాయి.
స్వల్పకాలిక మరియు మధ్యంతర లక్ష్యాలను సాధిస్తేనే దీర్ఘకాలిక లక్ష్యాలు
నెరవేరుతాయి.
దీర్ఘకాలిక
లక్ష్యాలు: పైన
చెప్పుకున్న ఉదాహరణలో పదో తరగతి చదివే విద్యార్థి పేరు మోసిన డాక్టర్ కావాలంటే
ఇంటర్మీడియట్ ఎం బి బి ఎస్, ఎం ఎస్
పూర్తి చేయడంతో పాటు అనుభవం కూడా గడించాలి. ఇదంతా జరగడానికి 10 నుంచి 15 సంవత్సరాల సమయం పట్టవచ్చు.
అలాగే పది కోట్లు సంపాదించ డానికి
పది సంవత్సరాలు పట్టవచ్చు. ఇలా ఎక్కువ కాలం తీసుకునే లక్ష్యాలను దీర్ఘకాలిక
లక్ష్యాలను అంటారు.
చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాలకు జీవిత లక్ష్యాలకు తేడా తెలియక, వీటిని జీవితం అనుకుంటు న్నారు. ఉదాహరణకి విద్యార్థి కోరుకున్నట్లు పేరున్న డాక్టర్ అయ్యాడనుకుందాం. ఇదే జీవిత లక్ష్యం అయితే అతనికి 35-40 సంవత్సరాల వయసు వచ్చేసరికి జీవిత లక్ష్యం నెరవేరినట్లే కాదా?. మరి ఇంకా బ్రతికి చేసేదేముంది. కాబట్టి మనిషి జీవిత లక్ష్యాలు ప్రాథమిక మరియు ద్వితీయ లక్ష్యాలు మాత్రమే.
సరియైన లక్ష్యం పెట్టుకోవడం ఎలా?
జీవితంలో విజయం సాధిస్తామా లేకపోతే అపజయం పొందుతామా అన్నది ప్రధానంగా ఎన్నుకున్న లక్ష్యం పైనే ఆధారపడి ఉంటుంది. సరైన లక్ష్యం పెట్టుకోవాలి అంటే తప్పని సరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి
1. మానవ శరీర శాస్త్రం
దీని గురించి తెలుసుకోవాలంటే
- మనిషికి సంబంధించిన నిజాలు
- మనిషిని ఎవరు నియంత్రిస్తున్నారు?
- కారణం లేకుండా ఏదైనా సంభవిస్తుందా?
- ప్రకృతిని అర్థం చేసుకోవడం ఎలా?
- చెడు ప్రవర్తనలవల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది
- నైతిక విలువలు ఎందుకు పతనం అవుతున్నాయన్న విషయాలు తెలుసుకోవాలి.
2. భావోద్వేగాలతో ఆరోగ్యానికి ఉన్న సంబంధం
ఈ సంబంధం తెలియాలంటే
- భావోద్వేగాలు
- మెదడు తరంగాలు
- హృదయ స్పందనలో తేడాలు
- హార్మోన్లు మరియు న్యూరో ట్రాన్స్ మిటర్లు మరియు
- మనుషుల స్వభావాలు అర్థం కావాలి.
వీటిలో ప్రధానమైనవి
- జీవితాన్ని నడుపుకోవడం ఎలా?
- మీ గురించి మీకు తెలుసా?
- జీవితం విలువ ఎంత?
- సమయం విలువ ఎంత?
- దేహం విలువ ఎంత?
- సమస్య పరిష్కారం, నిర్ణయాత్మక శక్తి ఉందా?
- ఆధ్యాత్మిక ప్రజ్ఞ మరియు
- ధ్యానం గురించి తెలుసుకోవాలి.
వివరాలకు lifeskillssankar.blogspot.com చూడండి.
*మీ లక్ష్యం సరైనదైతేనే ఫలితం కూడా బాగుంటుంది*
Source:
Sankara Pitchaiah Podila (2019) Personal Goal Setting, International Journal of Recent Scientific Research, Vol. 10, Issue, 02(B), pp. 30767-30772.