Saturday, August 10, 2019

మంచి స్నేహితులను నిర్ణయించుకోండి

స్నేహితులంటే మన మంచికోరేవారు, మనకు మంచిచేసేవారు. కాని ఈ మధ్య కొందరు స్నేహితుల పేరుతో ప్రతిరోజూ పాఠాలు వింటుంటే కదిలించడం, ఇంటికి వచ్చి బయటకు తీసుకువెళ్ళడం, చెడు అలవాట్లు నేర్పడం, ప్రోత్సహించడం మొదలైనవి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్నేహితులు కారు, శత్రువులకన్నా ప్రమాదకారులు.

మీ స్నేహితులను పరిశీలించండి

  • స్వార్థం ఎక్కువా?
  • తరచు డబ్బులు ఖర్చుపెట్టిస్తున్నారా?
  • తరచూ మీ సాయం అడుగుతున్నారా?
  • చెడుఅలవాట్లు ఉన్నాయా?
  • మీ సమయాన్ని వృధా చేస్తున్నారా?
  • పాఠాలు విననివ్వడం లేదా?
  • పనికిమాలిన మాటలతో కాలం గడుపుతున్నారా?
  • చదువులో వెనకబడ్డారా?
  • సరైన లక్ష్యం లేకుండా ఉన్నారా?
  • నైతిక విలువలు పాటించడంలేదా?
  • తరచూ అబద్ధాలు చెబుతున్నారా?
  • దొంగతనాలు చేస్తున్నారా?
  • ఇతరుల పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నారా?


వీటిలో కనీసం ఆరు విషయాలలో మీ సమాధానం ‘అవును’ అయితే అలాంటి వారితో స్నేహం మానండి.

*స్నేహితుడంటే ఓ మార్గదర్శి*

Sunday, July 14, 2019

దురాశ దుఃఖానికి చేటు


ఒంటరిగా వుండాలి అనిపించడం ఓ మానసిక సమస్య



చుట్టూ పదిమంది ఉంటేనే కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఇంకొందరికి నలుగురైదుగురు ఉంటే చాలు. అయితే మరి కొందరు తాము ఒక్కరే ఉండటానికి ఇష్టపడతారు. వీళ్ళకి స్నేహితులు ఉన్నా ఒక్కరూ లేదా ఇద్దరికి మించి ఉండరు. కారణం ఏదైనా ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

నష్టాలు
  • ·       భౌతిక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
  • ·        కొన్నిసార్లు చనిపోవాలనే కోరిక కలుగుతుంది
  • ·        పరస్పర సంబంధాలు బాగా తక్కువగా ఉంటాయి
  • ·        ఏదైనా సాధించాలన్న కోరిక ఉండదు
  • ·        జీవితం నిరాసక్తంగా సాగిపోతుంది
  • ·        మానసిక ఒత్తిడి పెరుగుతుంది
కారణాలు
  • ·        ఇంటర్నెట్
  • ·        సెల్ ఫోను 
  • ·        కుటుంబంలో కలతలు
  • ·        చదువులో వెనకబడటం
  • ·        తగ్గని జబ్బు
  • ·        డిప్రెషన్
  • ·        బాగా ఇష్టమైన వారు చనిపోవడం
  • ·        బాగా ఇష్టమైన వారు దూరం అవ్వటం
  • ·        ఆర్థిక ఇబ్బందులు
  • ·        సరిదిద్దుకోలేని తప్పు చేయటం లేదా జరగటం
  • ·        నిస్సహాయ స్థితి
  • ·        జన్యువులు
  • ·        బెదిరింపులు
పరిష్కారం
  • ·        సమస్య చాలా మందిలో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
  • ·        ధ్యానం వల్ల జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
  • ·        వీరిని మాటలతో బాధ పెట్టకూడదు.
  • ·        తోడున్నామని భరోసా ఇవ్వాలి.
  • ·        తన కాళ్ళపై తాను నిలబడగలిగే మనోధైర్యం పెంచాలి .
  • ·        సమస్యలను పరిష్కరించుకునే శక్తి పెంపొందించాలి.
  • ·        అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
ఒంటరితనం ఇష్టపడటానికి, ఆత్మహత్య చేసుకోవడానికి రెంటికి చాలావరకు ఒకే విధమైన కారణాలు  వుంటాయి. అందువల్ల వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.