స్నేహితులంటే మన మంచికోరేవారు, మనకు మంచిచేసేవారు. కాని ఈ మధ్య కొందరు స్నేహితుల పేరుతో ప్రతిరోజూ పాఠాలు వింటుంటే కదిలించడం, ఇంటికి వచ్చి బయటకు తీసుకువెళ్ళడం, చెడు అలవాట్లు నేర్పడం, ప్రోత్సహించడం మొదలైనవి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్నేహితులు కారు, శత్రువులకన్నా ప్రమాదకారులు.
మీ స్నేహితులను పరిశీలించండి
వీటిలో కనీసం ఆరు విషయాలలో మీ సమాధానం ‘అవును’ అయితే అలాంటి వారితో స్నేహం మానండి.
మీ స్నేహితులను పరిశీలించండి
- స్వార్థం ఎక్కువా?
- తరచు డబ్బులు ఖర్చుపెట్టిస్తున్నారా?
- తరచూ మీ సాయం అడుగుతున్నారా?
- చెడుఅలవాట్లు ఉన్నాయా?
- మీ సమయాన్ని వృధా చేస్తున్నారా?
- పాఠాలు విననివ్వడం లేదా?
- పనికిమాలిన మాటలతో కాలం గడుపుతున్నారా?
- చదువులో వెనకబడ్డారా?
- సరైన లక్ష్యం లేకుండా ఉన్నారా?
- నైతిక విలువలు పాటించడంలేదా?
- తరచూ అబద్ధాలు చెబుతున్నారా?
- దొంగతనాలు చేస్తున్నారా?
- ఇతరుల పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నారా?
వీటిలో కనీసం ఆరు విషయాలలో మీ సమాధానం ‘అవును’ అయితే అలాంటి వారితో స్నేహం మానండి.
*స్నేహితుడంటే ఓ మార్గదర్శి*
