చుట్టూ పదిమంది ఉంటేనే కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, ఇంకొందరికి నలుగురైదుగురు ఉంటే చాలు. అయితే మరి కొందరు తాము ఒక్కరే ఉండటానికి ఇష్టపడతారు. వీళ్ళకి స్నేహితులు ఉన్నా ఒక్కరూ లేదా ఇద్దరికి మించి ఉండరు. కారణం ఏదైనా ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
నష్టాలు
- · భౌతిక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
- · కొన్నిసార్లు చనిపోవాలనే కోరిక కలుగుతుంది
- · పరస్పర సంబంధాలు బాగా తక్కువగా ఉంటాయి
- · ఏదైనా సాధించాలన్న కోరిక ఉండదు
- · జీవితం నిరాసక్తంగా సాగిపోతుంది
- · మానసిక ఒత్తిడి పెరుగుతుంది
కారణాలు
- · ఇంటర్నెట్
- · సెల్ ఫోను
- · కుటుంబంలో కలతలు
- · చదువులో వెనకబడటం
- · తగ్గని జబ్బు
- · డిప్రెషన్
- · బాగా ఇష్టమైన వారు చనిపోవడం
- · బాగా ఇష్టమైన వారు దూరం అవ్వటం
- · ఆర్థిక ఇబ్బందులు
- · సరిదిద్దుకోలేని తప్పు చేయటం లేదా జరగటం
- · నిస్సహాయ స్థితి
- · జన్యువులు
- · బెదిరింపులు
పరిష్కారం
- · ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
- · ధ్యానం వల్ల జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
- · వీరిని మాటలతో బాధ పెట్టకూడదు.
- · తోడున్నామని భరోసా ఇవ్వాలి.
- · తన కాళ్ళపై తాను నిలబడగలిగే మనోధైర్యం పెంచాలి .
- · సమస్యలను పరిష్కరించుకునే శక్తి పెంపొందించాలి.
- · అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
ఒంటరితనం ఇష్టపడటానికి, ఆత్మహత్య చేసుకోవడానికి రెంటికి చాలావరకు ఒకే విధమైన కారణాలు వుంటాయి. అందువల్ల వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
