Wednesday, July 10, 2019

ఇంకా ధర్మం మిగిలి ఉన్నదంటే ఇలాంటి వారే కారణం!




ఇంత నష్టానికి మూలకారణం ఏంటి?





మానవ వైఖరే (Human Attitude) ఈ నష్టానికి మూలకారణం.
మనిషి తన స్వలాభం కోసమే బతకడం మాననంతవరకు, అహంకార పూరిత నైజం, పక్షపాత బుద్ధి తగ్గనంత  వరకు, డబ్బు, అధికారం, శృంగారం కోసం వెంపర్లాట ఆగనంతవరకు ఇలాంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. కాని మానవ వైఖరిలో మార్పు కోసం దాదాపుగా ఎలాంటి ప్రయత్నమూ జరగడం లేదని చెప్పవచ్చు.


Friday, July 5, 2019

చదివి వదిలేయకండి!


పాఠశాల స్థాయి నుండి జీవన నైపుణ్యాలు నేర్పకపోవడమే ఇలాంటి వాటికీ కారణం. 

నేర్పవలసిన జీవన నైపుణ్యాలు
  • విద్యా నైపుణ్యాలు
  • నిత్య జీవితంలో నైపుణ్యాలు
  • కెరీర్ నైపుణ్యాలు
  • సామాజిక నైపుణ్యాలు
  • భావోద్వేగాల అజమాయిషీ
  • భయాల అజమాయిషీ
  • బలహీనతలు,అలవాట్లు
  • మానవ శరీర శాస్త్రం
  • ఆధ్యాత్మిక ప్రజ్ఞ

నేర్చుకోదలచినవారు సంప్రదించండి

Dr. Sankara Pitchaiah Podila (Rtd., Professor )
M.Sc. Ph.D., M.A., Ph.D. (Psy), PGDHRM
Director
Student Solutions
Prasanna Coaching and Counselling Institute
3rd Cross, Saibaba Road, Guntur
Mobile:9440010001

Tuesday, June 18, 2019

భార్యతోనే ఎందుకలా!?!­­








మగవాళ్ళు సాధారణంగా తల్లి, చెల్లి, అక్క, వదిన, కూతురు మొదలైన వారందరి పట్ల ఇష్టంగా ఉంటారు. తల్లి చెప్పింది చేస్తారు, కూతురు అంటే ప్రాణం ఇస్తారు. కానీ, చాలామంది భార్యతో మాత్రమే సక్రమంగా ప్రవర్తించరు. తిట్టడం, కొట్టడం, కొందరైతే చంపడం చేస్తున్నారు.

 ఎందుకని!?!

తల్లి 25 నుంచి 30 సంవత్సరాలు తోడుగా ఉంటే, కూతురు వివాహం అయ్యే వరకు తోడుగా ఉంటుంది. వివాహం అయినప్పటి నుండి చచ్చేంత వరకు భార్య మాత్రమే తోడుగా ఉంటుంది, సేవలు చేస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది. మరి ఇందుకు రుణం తీర్చుకోవాల్సిందిపోయి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.

ఎందుకని!?!

కొందరు మగవాళ్లు తనకు ఇష్టమైన వాళ్లకి వేల రూపాయలు అడగకుండా ఇచ్చేస్తారు కానీ, భార్యకు మాత్రం 100 రూపాయలు ఇచ్చినా లెక్క అడుగుతారు. ఆమె ఉద్యోగం చేస్తుంటే జీతం కూడా తనే తీసుకుని ఆమె అవసరాలకి ఆచితూచి ఇస్తారు.

 ఎందుకని!?!

మగ వాడు గొప్పవాడు అనే భావన, ఆమె శారీరకంగా బలహీనురాలు అనే భావన, ఆర్థికంగా భర్తపై ఆధారపడడం, తన బిడ్డలకోసం ఇల్లు వదిలిపోలేదు అనే నమ్మకం, వెరసి ఆ తల్లి అంటే చులకన!మగవాడి దౌష్ట్యానికి ఇలా ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు.సమాజం కూడా ఒక్కదాన్నే ప్రశాంతంగా బతకనివ్వదు. 

బలహీనురాలిపైన చేసే దౌర్జన్యానికి శిక్ష వేసే శక్తి  ఎవరికి ఉందనే ధైర్యం కూడా కావచ్చు. కానీ మనల్ని ఏ శక్తి అయితే నడిపిస్తుందో అదే శక్తి శిక్షకూడా వేస్తుంది.ఇందుకు ఉదాహరణగా మన చుట్టూ ఉన్నవారినే చెప్పుకోవచ్చు.

ఆ ఇద్దరే భార్యాభర్తలుగా కావటానికి కారణం అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు జీవిస్తే అందరికీ మేలు.

మగవాళ్ళను హింసించే ఆడ వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది సుమా!